Tollywood: నేనిప్పుడే దేవుణ్ణి కలిశా.. రాజమౌళి

Tollywood: నేనిప్పుడే దేవుణ్ణి కలిశా.. రాజమౌళి
X
హాలీవుడ్‌ ఫిలిం మేకర్‌ స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో జక్కన్న

రాజమౌళి తెరకెక్కిచ్చిన చిత్రం "ఆర్‌ఆర్‌ఆర్‌" లోని "నాటు నాటు" పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌ దక్కించుకొని చరిత్ర సృష్టించిన విషయం విదితమే. ప్రపంచ సినీ ప్రముఖుల చూపంతా "ఆర్‌ఆర్‌ఆర్‌" పైనే ఉంటే ఆ చిత్ర దర్శకుడు జక్కన్న మాత్రం హాలీవుడ్‌ ఫిలిం మేకర్‌ స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ గురించి దరువేస్తున్నాడు.


స్టీవెన్ తో దికిన ఫొటోను తన ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేసిన రాజమౌళి దానికి 'ఐ జస్ట్‌ మెట్‌ గాడ్‌' అని క్యాప్షన్ పెట్టి అందరి చూపులను మరోమారు తన వైపు తిప్పుకున్నారు. ఆ పోస్ట్ లో జక్కన్న ఆనందం ప్రస్ఫుటంగా కనిపిస్తోందని చెప్పాల్సిందే. ఫ్యాన్ మూమెంట్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న దర్శక ధీరుడి కళ్లలో మెరుపు చూస్తుంటే మరింత ముచ్చటగొలుపుతోంది.


Tags

Next Story