Tollywood: హ్యాపీ బర్త్‌డే అనుపమ

కర్లీ హేయిర్.. మత్తెక్కించే కళ్లు..తీగ నడుముతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన చిన్నది అనుపమ పరమేశ్వరన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అఆ' సినిమాతో తెలుగు వారికి దెగ్గరైంది ఈ మలయాళ కుట్టి. ఈ రోజు అనుపమ పుట్టినరోజు.
1996లో కేరళలోని జలకుడలో జన్మించింది అనుపమ. కొట్టాయమ్‌లోని సీఎమ్ఎమ్ కాలేజీలో చదువుతున్నప్పుడే నివిన్ పౌలీ హీరోగా తెరకెక్కిన ప్రేమమ్ చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆ తరువాత వరుసగా తెలుగు, మలయాళం, తమిళంలో నటిస్తోంది. ఇటీవలే కార్తికేయ-2, 18పేజెస్ సినిమాల్లో నిఖిల్ సరసన నటించి మంచి హిట్సే కొట్టేసింది. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు యాక్టివ్‌గానే ఉంటుంది. తన హొయలు ఒలికించే ఫోటోలతో కుర్రాళ్ల గుండెల్లో గుర్రాళ్లను పరిగెత్తిస్తోంది. ఈ రోజు అమ్మడు బర్త్‌డే కావడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com