Tollywood: ధూం..ధాం దసరా ట్రైలర్
సినిమాపై అమాంతం అంచనాలు పెంచేస్తున్న నాని మాస్ డైలాగ్స్

నేచురల్ స్టార్ నాని ఊరమాస్ లుక్‌లో పాన్ ఇండియా మూవీగా ‘దసరా’ తెరకెక్కుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తీ సురేష్ నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. అయితే మార్చి 30న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అవ్వనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను గట్టిగానే నిర్వహిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. లక్నోలోని ప్రతిభా థియేటర్‌లో అభిమానుల హంగామా మధ్య నాని, టీమ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో నాని పక్కా ఊరమాస్ లుక్స్‌లో అదరకొట్టాడు. నాని చెప్పే మాస్ డైలాగ్స్ అంచనాలు అమాంతం పెరిగేస్తున్నాయ్.. నాని ఊర మాస్ జాతర చూడాలంటే మార్చి 30 వరకు ఎదురు చూడాల్పిందే