Tollywood: మార్చ్ 14న దసరా ట్రైలర్

నేచురల్ స్టార్ నానికి గత రెండేళ్లుగా ఊహించిన హిట్‌లు రావడంలేదు. నాని ఖాతాలో వచ్చిన శ్యామ్ సింగారాయ్ పర్వలేదనిపిచ్చుకున్నప్పటికీ టక్ జగదీష్ మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే ఈ సారి ఎలాగైన పెద్ద హిట్ కొట్టాలని కసితో ఉన్న నాని తన కంఫర్ట్ జోన్ వదిలి ఊరమాస్ లుక్‌లో దసరా సినిమాతో ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యాడు. దీంతో తన అభిమానులు ఆయన కంబ్యాక్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 30న వెండితెరలపై విడుదల కాబోతోంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై అంచనాలు భారిగా పెంచుతూ వస్తుంది. ఇప్పటికే రిలీజైన పాటలు ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి. అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ అప్‌డేట్‌ను ప్రకటించారు. దసరా ట్రైలర్‌ను మార్చి 14న రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే అభిమానుల్లో పూనాకాలు పుట్టించిన దసరా టీజర్ ట్రైలర్‌తో ఇంకే రేంజ్‌లో ఉండబోతోందోనని అభిమానులు గట్టీగానే అంచనాలు పెంచేసుకుంటున్నారు. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన దసరా సినిమాలో నాని సరసన కీర్తిసురేష్ నటిస్తోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com