Tollywood: RRR ఆస్కార్ పై.. బాలీవుడ్ కింగ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ దాదాపు నాలుగేళ్ల తర్వాత నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పఠాన్'. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ను షారుక్ తన ట్వీటర్ వేదికగా షేర్ చేయగా దీనికి రామ్ చరణ్ స్పందించాడు. 'పఠాన్' టీమ్ కు కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్ ఆర్ఆర్ఆర్(RRR)టీమ్‌ను ట్విట్టర్ వేదికగా ఓ కోరిక కోరారు.
''మీరు ఆస్కార్‌ను ఇంటికి తెచ్చినప్పుడు నన్ను దానిని టచ్ చేయనీయండి అంటూ బాద్‌షా తన మనసులోని కోరికను బయటపెట్టారు. ఈ ట్వీట్‌కు రామ్ చరణ్ స్పందిస్తూ.. 'తప్పకుండా షారుఖ్ సార్.. ఆ అవార్డ్ ఇండియన్ సినిమా మొత్తానికి చెందినది'అని పేర్కొన్నారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.
మరోవైపు ఈ ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వైపు ఆర్‌ఆర్‌ఆర్(RRR)ఆస్కార్ బరిలో నిలవడంతో బాద్‌షా చేసిన ఇంట్రస్టింగ్ కామెంట్స్ కు మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. అంతేకాదు ఆర్ఆర్ఆర్(RRR)ఆస్కార్ అవార్డును, బాలీవుడ్ కింగ్ ఖాన్ చేతుల్లో త్వరలో చూడబోతున్నాము అంటూ మెగాఫ్యాన్స్ తోపాటు, నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com