Top Gun Maverick : థ్యాంక్స్ అంటూనే దూకేసిన టామ్ క్రూజ్.. చూసేందుకే ఒళ్లు గగుర్పాటు

Top Gun Maverick : థ్యాంక్స్ అంటూనే దూకేసిన టామ్ క్రూజ్.. చూసేందుకే ఒళ్లు గగుర్పాటు
Top Gun Maverick : కిక్కు కోసం ఆకాశం నుంచి దూసేకిన టామ్ క్రూజ్, టాప్ గన్ సినిమాను హిట్ చేసినందుకు అభిమానులకు స్పెషల్ థాంక్స్, ఇలా ఎవరైనా చెబుతారా అంటోన్న నెటిజెన్స్

Top Gun Maverick : సాధారణంగా సిల్వర్ స్క్రీన్ పై కళ్లు చెదిరే విన్యాసాలతో మైమరపించే టామ్ క్రూజ్ ఇప్పుడు రియల్ స్టంట్లతో తన ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ఈ ఏడాది తనకు సూపర్ సక్సెస్ ను అందించినందుకు గానూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు గాల్లో తేలుతూ థ్యాంక్స్ చెప్పాడు. గాల్లో తేలుతూ అంటే ఏదో మాటవరుసకు కాదండోయ్ నిజంగానే ఆకాశం నుంచి కిందకు దూకుతూ మనోడు చెప్పిన థ్యాంక్స్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కు ఇచ్చే విధంగా ఉందని ఒప్పుకోక తప్పదు.



ఈ ఏడాది టాప్ గన్ మేవరిక్ మూవీతో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేశాడు టామ్ క్రూజ్. ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుని 2022లోనే అత్యంత భారీ కలెక్షన్స్ రాబట్టుకున్న సినిమాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాను ఇంతగా ఆదరించిన ఫ్యాన్స్ కు తనదైన స్టైల్ లోనే కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాడు మన క్రేజీ హీరో. ఇంకేముంది టాప్ గన్ : డెడ్ రికానింగ్ పార్ట్ 1, 2 షూటింగ్ లో అందుకు వేదికను ఫిక్స్ చేశాడు.



తొలుత ఫ్లైట్ లో కూర్చుని నిమ్మళంగా మాట్లాడిన టామ్ క్రూజ్ తన అభిమానులను అడ్రెస్ చేస్తూనే ఉన్నట్లుండి జెట్ ఫ్లైట్ నుంచి అమాంతం కిందకు దూకేశాడు. ఇక పై నుంచి కిందకు పడుతూ కూడా అభిమానులకు తన సందేశాన్ని అందజేస్తూనే ఉన్నాడు. 'మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈ షాట్ ను పూర్తి చేయాల్సి ఉంది, హ్యాపీ హాలిడేస్, మూవీస్ లో కలుసుకుందాం' అంటూ గాల్లో తేలుతూనే చెప్పాడు.



ఆకాశంలో విన్యాసాలు చేయడం టామ్ క్రూజ్ కు కొత్తేమీ కాదు. ఒక బిల్డింగ్ మీద నుంచి మరో బిల్డింగ్ మీదకు లాంగ్ జంప్ లు కొట్టడం, కదులుతున్న ఫ్లైట్ లో నుంచి దూకేయడాలు సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ, ఇలా అభిమానులకు కిక్ ఇచ్చేందుకు కూడా విన్యాసాలు చేయడం ఇదే మొదటిసారి కాబోలు. ఏమైనా టామ్ ఇచ్చిన ట్రీట్ కు ఫ్యాన్స్ మాత్రం సూపర్ హ్యాపీ.



Tags

Read MoreRead Less
Next Story