Chandramukhi 2: 'చంద్రముఖి 2' కోసం ఆ సీనియర్ హీరోయిన్.. వారిని కాదని..

Chandramukhi 2: చంద్రముఖి 2 కోసం ఆ సీనియర్ హీరోయిన్.. వారిని కాదని..
Chandramukhi 2: చంద్రముఖి అనే సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Chandramukhi 2: చంద్రముఖి అనే సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హారర్ సినిమాలంటే కొందరు దర్శకులు మాత్రమే తెరకెక్కించగలరు అనుకుంటున్న సమయంలో చంద్రముఖి చిత్రంతో హారర్ సినిమాల్లో ఓ ల్యాండ్ మార్క్ క్రియేట్ చేశారు దర్శకుడు పి వాసు. 2005లో విడుదలయిన ఈ సినిమాకు ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ రానుంది. ఈ సీక్వెల్‌లో ఓ సీనియర్ హీరోయిన్ నటించనుందనే టాక్ వినిపిస్తోంది.

17 ఏళ్ల తర్వాత చంద్రముఖికి సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు దర్శకుడు పి వాసు. రాఘవ లారెన్స్, వడివేలు లీడ్ రోల్‌లో చంద్రముఖి 2 త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక హారర్ సినిమాలతో వరుసగా హిట్లు కొడుతున్న రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తుండడంతో.. చంద్రముఖి సీక్వెల్‌పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. కోలీవుడ్‌లోనే అది పెద్ద నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించనుంది.

చంద్రముఖి సినిమాలో జ్యోతిక క్యారెక్టర్ ఎంత ముఖ్యమైనదో తెలిసిందే. ఆ సినిమాను పూర్తిగా తన భుజాలపై మోసే పాత్రలో కనిపించింది జ్యోతిక. ఇక నయనతార కూడా ఒక కీ రోల్‌లో కనిపించింది. కానీ చంద్రముఖి 2లో వీరిద్దరూ ఉండబోరని సమాచారం. అయితే ఇందులో లీడ్ రోల్‌లో సీనియర్ హీరోయిన్ త్రిష చేయనుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.



Tags

Read MoreRead Less
Next Story