Trisha: త్రిష జీవితం నుండి వెళ్లిపోయిన వ్యక్తి ఎవరు..? ఆ పోస్ట్‌కు అర్థమేంటి..?

Trisha: ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన సీనియర్ హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. కానీ వారందరికీ గతంలో ప్రేమ వ్యవహారాలు ఉన్నాయి. అయినా కూడా అవన్నీ మర్చిపోయి పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో సెటిల్ అయినవారు ఎంతమంది ఉన్నారో.. ఇక పెళ్లే వద్దు అని ఉండిపోయిన వారు కూడా అదే సంఖ్యలో ఉన్నారు. అయితే తాజాగా త్రిష చేసిన పోస్ట్ తన పర్సనల్ లైఫ్‌పై పలు అనుమానాలు రేకెత్తిస్తోంది.
కోలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన త్రిష.. తెలుగులో కూడా స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. ఒకానొక సమయంలో దాదాపు అందరూ తెలుగు, తమిళ హీరోలతో నటించిన హీరోయిన్‌గా త్రిష రికార్డ్ సాధించింది. కానీ ఇప్పుడు మాత్రం కొత్తగా వచ్చిన హీరోయిన్ల తాకిడికి తట్టుకోలేక త్రిషకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కి్స్తున్న 'పొన్నియిన్ సెల్వన్'లో నటిస్తోంది త్రిష.
త్రిష ఇప్పటికే ఓ కోలీవుడ్ నిర్మాతను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. కానీ నిశ్చితార్థం తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్ల ఓ తెలుగు హీరోతో డేటింగ్ చేసింది. ఇప్పుడు త్రిష రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి ఎవరికీ తెలియదు. కానీ ఇటీవల త్రిష పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ తను రిలేషన్‌షిప్‌లో ఉండి బ్రేకప్ అయ్యిందేమో అనిపించేలా చేస్తోంది.
'విషపూరితమైన మనస్వత్తం కలిగిన వ్యక్తులు వాళ్లంతట వాళ్లే నీతో మాట్లాడటం మానేయడం ఎంతో సంతోషంగా ఉంటుంది. దీన్ని చూస్తుంటే చెత్త దానంతటదే అదే తొలగిపోయినట్లు ఉంది' అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ షేర్ చేసింది త్రిష. దీంతో త్రిష అసలు ఎవరి గురించి రాసుకొచ్చింది? తన జీవితంలో నుండి తనంతట తానుగా దూరమయిపోయిన వ్యక్తి ఎవరు అని అభిమానులు ఆరాతీయడం మొదలుపెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com