1 Aug 2022 11:00 AM GMT

Home
 / 
సినిమా / సమస్తం / Urvashi Rautela:...

Urvashi Rautela: హీరోయిన్ షాకింగ్ రెమ్యునరేషన్.. సౌత్‌లోనే మొదటిసారి..

Urvashi Rautela: బాలీవుడ్ సినిమాలతో హీరోయిన్‌గా డెబ్యూ ఇచ్చింది ఊర్వశి రౌతెలా.

Urvashi Rautela: హీరోయిన్ షాకింగ్ రెమ్యునరేషన్.. సౌత్‌లోనే మొదటిసారి..
X

Urvashi Rautela: మామూలుగా సినీ పరిశ్రమలో హీరోలకంటే హీరోయిన్లకు తక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది. హీరోలకు ఇచ్చేదాంట్లో సగం మాత్రమే హీరోయిన్లకు దక్కుతుంది. చాలా తక్కువమంది స్టార్ హీరోయిన్లు మాత్రమే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల కోసం స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం డెబ్యూ హీరోతో నటించడానికే ఇప్పటివరకు సినీ పరిశ్రమలో ఏ నటీ తీసుకోనంత పారితోషికం తీసుకుందని సమాచారం.

బాలీవుడ్ సినిమాలతో హీరోయిన్‌గా డెబ్యూ ఇచ్చింది ఊర్వశి రౌతెలా. సినిమాలకంటే ఎక్కువగా హిందీ ఆల్బమ్ సాంగ్స్ వల్లే పాపులారిటీ సంపాదించుకుంది. డ్యాన్స్, గ్లామర్ అంతా బాగుండడంతో ఊర్వశి దగ్గరికి వచ్చే సినిమా అవకాశాలు కూడా ఎక్కువయ్యాయి. హిందీతో పాటు బెంగాలీ, కన్నడ భాషల్లో కూడా ఒక్కొక్క చిత్రం చేసింది ఈ భామ. ఇక తాజాగా 'ది లెజెండ్' చిత్రంతో కోలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది.


చెన్నైలో పాపులర్ బిజినెస్‌మ్యాన్ శరవణన్.. హీరోగా తెరకెక్కిన చిత్రమే 'ది లెజెండ్'. హీరోగా తనను తాను తెరపై చూసుకోవాలన్ని కోరిక తీరడం కోసం శరవణన్ చాలానే ఖర్చుపెట్టాడు. అందులో ఊర్వశి రెమ్యునరేషన్ కూడా ఒకటి. ఈ సినిమాలో నటించడం కోసం ఊర్వశి రౌతెలా రూ.20 కోట్ల రెమ్యునరేషన్ అందుకుందట. సౌత్‌లో ఇప్పటివరకు ఇంత రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్సే లేరు. దీంతో ప్రస్తుతం ఊర్వశి పేరు సౌత్‌లో మారుమోగిపోతోంది.



Next Story