Valentines Day: జైలు నుంచి నటికి లవ్ సందేశం...

ఫోర్టిస్ కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త భార్యను మాయమాటలతో ప్రలోభ పెట్టి సుమారు రూ. 217 కోట్ల విలువైన ఆస్థులను అక్రమంగా దోచుకున్న ఘరానా మోసగాడు సుశేఖ్ చంద్రశేఖర్ మరోసారి వార్తలకు ఎక్కాడు. ప్రేమికుల దినోత్సవం పురస్కరించుకుని బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండేజ్ కు శుభాకాంక్షలు తెలిపాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్ట్ రూమ్ కు వెళుతుండగా సుఖేశ్ తారసపడటంతో విలేఖరులు అతడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే జాక్విలిన్ గురించి అడగ్గా ఆమెకు తన తరఫున వేలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా చెప్పాడు. అంతకు మించి ఆమె గురించి మాట్లాడేందుకు నిరాకరించాడు. ఎవరినైనా ప్రేమించేమంటే వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తామంటూ సుఖేశ్ చెప్పుకొచ్చాడు. ఇక నోరా ఫతేహీ గురించి అడగ్గా... డబ్బుల కోసం ప్రేమను నటించే వారి గురించి మాట్లాడనంటూ స్పష్టం చేశాడు. మంగళవారం పాటియాలా హౌస్ కోర్టుకు హాజరైన సుఖేశ్ చంద్రశేఖర్ ఆస్థులను వేలం వేసే అంశాన్ని కోర్టు పరిశీలిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com