18 July 2022 1:35 PM GMT

Home
 / 
సినిమా / సమస్తం / Vedaant Madhavan:...

Vedaant Madhavan: మాధవన్ కుమారుడి కొత్త రికార్డ్.. రియాక్ట్ అయిన ప్రియాంక చోప్రా..

Vedaant Madhavan: మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్.. మంచి స్విమ్మర్ అని అందరికీ తెలిసిన విషయమే.

Vedaant Madhavan: మాధవన్ కుమారుడి కొత్త రికార్డ్.. రియాక్ట్ అయిన ప్రియాంక చోప్రా..
X

Vedaant Madhavan: చాలావరకు హీరోహీరోయిన్ల వారసులు సినిమా ఇండస్ట్రీలోనే గుర్తింపు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా తక్కువమంది మాత్రమే దీనికంటే భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ భిన్నమైన మార్గాన్ని ఎంచుకోవడం ముఖ్యం కాదు.. అందులో ముందుకు వెళ్లి బెస్ట్‌గా నిలవడం ముఖ్యం. ప్రస్తుతం హీరో మాధవన్ కుమారుడు కూడా అదే చేస్తున్నాడు. దీంతో సెలబ్రిటీల దగ్గర నుండి సైతం ప్రశంసలు అందుకుంటున్నాడు.

మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్.. మంచి స్విమ్మర్ అని అందరికీ తెలిసిన విషయమే. అందుకే తన కొడుకును ఇంటర్నెషనల్ లెవెల్‌కు తీసుకెళ్లడానికి మాధవన్ విస్త్రతంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో స్విమ్మింగ్ పోటీల్లో మెడల్స్ గెలుచుకున్న వేదాంత్.. తాజాగా మరో మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. 1500 మీటర్లలో నేషనల్ జూనియర్ స్విమ్మింగ్ రికార్డ్‌ను వేదాంత్ తిరగరాశాడు. ఈ విషయాన్ని మాధవన్ సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు.


ఎప్పటికీ, ఎప్పటికీ వెనకడగు వేయొద్దు అని అర్థం వచ్చేలా వేదాంత్ స్విమ్మింగ్ వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు మాధవన్. దీనికి ప్రియాంక చోప్రా 'శుభాకాంక్షలు వేదాంత్ మాధవన్. ఇది చాలా అద్భుతం. ఇలాగే ముందుకు వెళ్తూ ఉండు.' అని మధవన్ దంపతులకు ధన్యవాదాలు చెప్తూ ట్వీట్ చేసింది. దీనికి మాధవన్ 'థాంక్యూ, నువ్వు బెస్ట్' అంటూ రియాక్ట్ అయ్యాడు.


Next Story