Veerasimha Reddy: జై బాలయ్యా.. మోతెక్కిపోయిన మెల్బోర్న్...

Veerasimha Reddy: జై బాలయ్యా.. మోతెక్కిపోయిన మెల్బోర్న్...
మెల్బోర్న్ లో వీర సింహా రెడ్డి హంగామా... వీధుల్లో అభిమానుల సందడి... జై బాలయ్య నినాదాలతో రచ్చ రచ్చ....

పంగడ కళను ముందే మోసుకొచ్చిన వీర సింహా రెడ్డి సినిమా మొదటి రోజే అద్భుతమైన టాక్ సంపాదించుకుని బాక్సాఫీస్ ను షేక్ చేసేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బాలయ్య ఫీవర్ తో ఊగిపోతున్నాయి. అయితే ఇది ఇక్కడితో సరి అనుకుంటే పొరపాటే... ఎందుకంటే బాలయ్య ఖ్యాతి ఖండాంతరాలు దాటింది మరి.


ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో వీరసింహారెడ్డి రిలీజ్‌ సందర్భంగా బాలయ్య అభిమానుల హడావిడి అంతా ఇంతా కాదు. మెల్‌బోర్న్‌, బ్రిస్‌బేన్‌, అడిలైడ్‌ నగరాల్లో థియేటర్ల వద్ద కోలాహలం నెలకొంది. అడిలైడ్‌ నగరంలో కొందరు ఔత్సాహిక అభిమానులు... భారీ కార్ల ర్యాలీ నిర్వహించి సినిమా చూసేందుకు వెళ్లారు. జై బాలయ్య నినాదాలతో వీధులను మోతెక్కించేశారు.


మరోవైపు బ్రిస్‌బేన్‌ నగరంలో కేక్‌ కటింగ్‌లు నిర్వహించి బాలకృష్ణపై అభిమానాన్ని చాటుకున్నారు. మొత్తానికి వీరసింహారెడ్డి సంక్రాంతి సంబరాలను రెట్టింపు చేసిందనే చెప్పాలి.





Tags

Read MoreRead Less
Next Story