Vetrimaaran Kamal Haasan : రాజకీయ వేడిని రగిల్చిన కమల్, వెట్రిమారన్ వ్యాఖ్యలు..

Vetrimaaran Kamal Haasan : ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్, నటుడు కమల్ హాసన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఇటీవళ పొన్నియిన్ సెల్వన్ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. రాజ రాజ చోలుడి చరిత్రను ఆధారం చేసుకొని కల్కి కృష్ణమూర్తి రాసిన నవల 'పొన్నియిన్ సెల్వన్'. దీని ఆధారంగా చేసుకొని మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీపై వెట్రిమారన్, కమల్ ఓ ఇంటర్వూలో చర్చించారు. దర్శకుడు వెట్రిమారన్ మాట్లాడుతూ.. 'రాజరాజ చోళుడు అసలు హిందువే కాదు.. కానీ కొందరు గుర్తింపును లాక్కెల్లాలని చూస్తున్నారు' అని అన్నారు. దీనికి కమల్ హాసన్ అవునని అన్నారు.
కమల్ మాట్లాడుతూ.. 'రాజరరాజ చోలుడి కాలంలో అసలు హిందూ మతమే లేదు. వైనం, శివం, సమానం మాత్రమే ఉన్నాయని వ్యాఖ్యానించారు'. ఈ వ్యాఖ్యల పై గవర్నర్ తమిళిసైతో పాటు అనేక మంది బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తమ అవసరాల కోసం తమిళ గుర్తింపును కమల్ హాసన్ లాంటి వారు దాచేస్తున్నారని మండిపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com