9 Jun 2022 10:00 AM GMT

Home
 / 
సినిమా / సమస్తం / Nayan Vignesh:...

Nayan Vignesh: గ్రాండ్‌గా నయన్, విగ్నేష్ పెళ్లి.. ఫోటోలు షేర్ చేసిన వరుడు..

Nayan Vignesh: 'నానుమ్ రౌడీ థాన్' సినిమా సమయంలో నయన్, విగ్నేష్‌కు పరిచయం ఏర్పడింది.

Nayan Vignesh: గ్రాండ్‌గా నయన్, విగ్నేష్ పెళ్లి.. ఫోటోలు షేర్ చేసిన వరుడు..
X

Nayan Vignesh: ఈమధ్య సినీ పరిశ్రమలో ఎన్నో ప్రేమజంటలు పెళ్లి పీటలెక్కాయి. ఏ హంగు, ఆర్భాటం లేకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకోవడం ఇప్పుడు కామన్‌‌గా మారిపోయింది. అందుకే పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా బయటికి రావడం లేదు. తాజాగా నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి కూడా అలాగే జరిగింది. కానీ పెళ్లయిన తర్వాత విగ్నేష్ స్వయంగా తమ పెళ్లి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.


'నానుమ్ రౌడీ థాన్' సినిమా సమయంలో నయన్, విగ్నేష్‌కు పరిచయం ఏర్పడింది. ఇక కొన్నాళ్లకే వారు ప్రేమలో పడ్డారు. ఏడేళ్లుగా వీరిద్దరు కోలీవుడ్ క్యూట్ లవ్ బర్డ్స్‌గా కొనసాగుతున్నారు. ఇక పెళ్లెప్పుడు అన్న ప్రశ్నను వీరిద్దరు ఎప్పటికప్పుడు దాటేస్తూ వచ్చారు. కరోనా వల్ల పెళ్లి పోస్ట్‌పోన్ అయినట్టు విగ్నేష్ తన సమాధానాన్ని దాటేస్తూ వచ్చాడు. ఇక తాజాగా వీరిద్దరు పెళ్లితో ఒకటయ్యారు.


'10 స్కేల్‌లో తను నైన్.. అయితే నేను వన్.. దేవుడి ఆశీస్సులతో, తల్లిదండ్రులు, సన్నిహితులతో ఆశీస్సులతో.. ఇప్పుడే నేను నయనతారను పెళ్లి చేసుకున్నాను' అంటూ విగ్నేష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పెళ్లి తమ కుటుంబ సభ్యలతో పాటు కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. షారుక్, అట్లీ లాంటి వారు వీరి పెళ్లిలో సందడి చేశారు.










Next Story