10 July 2022 6:30 AM GMT

Home
 / 
సినిమా / సమస్తం / Vignesh Shivan:...

Vignesh Shivan: పెళ్లయ్యి నెలరోజులు.. మరికొన్ని స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన విఘ్నేష్..

Vignesh Shivan: కోలీవుడ్‌లో ఇటీవల జరిగిన నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది.

Vignesh Shivan: పెళ్లయ్యి నెలరోజులు.. మరికొన్ని స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన విఘ్నేష్..
X

Vignesh Shivan: కోలీవుడ్‌లో ఇటీవల జరిగిన నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది. డైరెక్టర్‌గా నయనతారకు పరిచయమయిన తను.. నయన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది చాలా స్పెషల్ అంటూ విఘ్నేష్ పెళ్లిరోజే సోషల్ మీడియా పోస్ట్‌తో తెలియజేశాడు. పెళ్లిరోజున తన భావాలన్నీ పలు పోస్టుల రూపంలో తెలియజేసిన విఘ్నేష్.. తనకు, నయన్‌కు పెళ్లయ్యి నెలరోజులు అయిన సందర్భంగా మరికొన్ని ఫోటోలను బయటపెట్టాడు.

'నానుమ్ రౌడీ థాన్' సినిమా కోసం మొదటిసారి కలిసి పనిచేశారు నయన్, విఘ్నేష్. అప్పుడే వారు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత వారి పరిచయం స్నేహంగా మారింది. ఇక చాలాకాలం నుండి రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరు.. తమ సోషల్ మీడియా పోస్టులతో వారి ప్రేమ గురించి బయటపెట్టారు. తమ సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో జూన్ 8న నయన్, విఘ్నేష్ పెళ్లి చేసుకున్నారు.

ఇటీవల హనీమూన్‌కు వెళ్లొచ్చిన నయన్, విఘ్నేష్ తిరిగి రాగానే ఎవరి సినిమా పనుల్లో వారు బిజీ అయిపోయారు. కానీ ఎప్పటికప్పుడు నయన్ మీద తన ప్రేమను పోస్టుల రూపంలో తెలియజేస్తూనే ఉన్న విఘ్నేష్.. ఇటీవల మరికొన్ని పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో వదిలాడు. తమ పెళ్లికి రజినీకాంత్, మణిరత్నం, షారుక్ ఖాన్ ముఖ్య అతిథులుగా వెళ్లగా వారితో దిగిన ఫోటోలను పోస్ట్ చేసి పెళ్లికి వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు.


Next Story