Vijay Devarakonda: త్వరలో ఆ క్రేజీ డైరెక్టర్‌తో పాన్ ఇండియా సినిమా: విజయ్

Vijay Devarakonda: పాన్ ఇండియా సినిమాకు బడ్జెట్‌ను మించిన లాభాలు రావాలంటే ప్రతీ భాషా ప్రేక్షకుడికి ఆ సినిమా దగ్గర అవ్వాలి. అలా దగ్గర చేయాల్సిన బాధ్యత పూర్తిగా మూవీ టీమ్‌పైనే ఉంటుంది. తమ సినిమాలో ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసే సత్తా ఉందని వారు నిరూపించుకోగలిగితే.. సినిమా సగం హిట్. ప్రస్తుతం 'లైగర్' టీమ్ కూడా అదే ప్రయత్నంలో ఉంది. తాజాగా జరిగిన ప్రమోషన్స్ విజయ్ దేవరకొండ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.
పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'లైగర్'. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. అయితే ఈ మూవీ కోసం టీమ్ అంతా దాదాపు రెండేళ్లు కష్టపడింది. అందుకే ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని దేశమంతా చుట్టేస్తూ లైగర్ టీమ్ ప్రచారం చేస్తోంది. ఇటీవల లైగర్ ప్రమోషన్స్ కోసం చెన్నై వెళ్లింది బృందం.
లైగర్ సినిమాలో తన పాత్రకు నత్తి ఉంటుందని, అలా నటించడానికి చాలా కష్టపడ్డాను అంటూ తన క్యారెక్టర్ గురించి చెప్పుకొచ్చాడు విజయ్. తమిళ ప్రేక్షకులు మంచి చిత్రాలను ఆదరిస్తారని, త్వరలోనే తమిళంలో వరుసగా సినిమాలు చేస్తానని ఫ్యాన్స్‌కు మాటిచ్చాడు. లోకేష్ కనకరాజ్, వెట్రిమారన్, పా.రంజిత్ అంటే చాలా ఇష్టమని, వారితో రెగ్యులర్ గా ఫోన్‌లో టచ్‌లో ఉన్నానని చెప్పుకొచ్చాడు విజయ్. అంతే కాకుండా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయాలని చూస్తున్నాను అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఈ న్యూస్ విజయ్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com