19 July 2022 3:00 PM GMT

Home
 / 
సినిమా / సమస్తం / Vijay Sethupathi:...

Vijay Sethupathi: వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్న విజయ్ సేతుపతి కుమారుడు..

Vijay Sethupathi: ప్రస్తుతం విజయ్ సేతుపతి చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.

Vijay Sethupathi: వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్న విజయ్ సేతుపతి కుమారుడు..
X

Vijay Sethupathi: స్టార్ హీరోహీరోయిన్లుగా పేర్లు తెచ్చుకున్న తర్వాత చాలామంది నటీనటులు వారి వారసులనను కూడా ప్రేక్షకులకు అలాగే పరిచయం చేయాలనుకుంటారు. ఇటీవల ఈ లిస్ట్‌లో మరో స్టార్ నటుడి వారసుడు కూడా చేరనున్నట్టు సమాచారం. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా ఏ పాత్ర అయినా తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మైమరిపించే విజయ్ సేతుపతి.. త్వరలోనే తన కుమారుడిని నటుడిగా పరిచయం చేయనున్నారట.

ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టి.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అయిపోయారు విజయ్ సేతుపతి. కేవలం హీరోగానే కాదు.. ప్రాముఖ్యత ఉన్న ఏ పాత్ర చేయడానికి అయినా సేతుపతి సిద్ధం. అంతే కాకుండా తెలుగు, తమిళం అని తేడా లేకుండా ఏ భాషలో అయినా 100 శాతం డెడికేషన్‌తో చేస్తారు ఈ నటుడు.

ప్రస్తుతం విజయ్ సేతుపతి చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి 'విడుదలై'. వెట్రిమారాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి కుమారుడు సూర్య.. ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే 'నానుమ్ రౌడీ థాన్' అనే చిత్రంతో సూర్య డెబ్యూ చేసినట్టు రూమర్స్ వచ్చినా.. అది నిజమో కాదో చాలావరకు క్లారిటీ లేదు. కానీ త్వరలోనే విడుదలైతో సూర్య డెబ్యూ ఖాయమని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Next Story