Vijay Setupathi: నేను హర్టయ్యా ....

Vijay Setupathi: నేను హర్టయ్యా ....
పాన్ ఇండియా స్టార్ స్టేటస్ పై కస్సుమంటోన్న విజయ్ సేతుపతి; గతంలోనూ పలువురు స్టార్స్ అప్సెట్

ప్రస్తుతం సినీ పరిశ్రమలో పాన్ ఇండియా స్టార అనే పదం చాలా కామన్ అయిపోయింది. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ సేతుపతి, ప్రభాస్ వంటి ఎ-లిస్టర్స్ అందరూ పాన్ ఇండియా రేంజ్ అందుకోవడంతో వారికి ఆ బిరుదు సరిపోయింది. ఉత్రరాది రాష్ట్రాల్లోనూ వీరి సినిమాలకు నెలకొన్న డిమాండ్ కూడా అందుకు దోహదపడుతోంది. అయితే కొంత మంది స్టార్స్ మాత్రం ఆ బిరుదు మాకొద్దు బాస్ అనేస్తున్నారు. విలక్షణమైన నటుడిగా పేరుగాంచిన విజయ్ సేతపతి ఈ విషయమై అప్సెట్ అయ్యాడట. ఇంతకూ విషయం ఏమిటంటే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫర్జీ వెబ్ సిరీస్ లో సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంలో విజయ్ ను పాన్ ఇండియా స్టార్ అనే సరికి కాస్త చిన్నబుచ్చుకున్నాడని వినికిడి. ఇటీవలే ఓ సినీ వార పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దీనిపై స్పందించాడు. తాను ఒక నటుడిని మాత్రమేనని, ప్యాన్ ఇండియా స్టార్ లాంటి బిరుదులు తనను అసౌకర్యానికి గురిచేస్తాయని వెల్లడించారు. అంతేకాదు, అలాంటి బిరుదులు మరింత ఒత్తిడిని తెచ్చిపెడతాయని, కాబట్టి వాటికి దూరంగా ఉండటమే మంచిదని మఖ్తాయించేశాడు. విజయ్ మాత్రమే కాదు, గతంలో దుల్కర్ సల్మాన్, మన డార్లింగ్ ప్రభాస్ కూడా ఇదే విధంగా ప్యాన్ ఇండియా స్టార్ టైటిల్ మాకొద్దు బాబాయ్ అంటూ గగ్గోలు పెట్టిన సంగితి తెలిసిందే. ప్రస్తుతం ఆట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో సేతుపతి ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. ఈ సినిమాలో నయనతార ఫిమేల్ లీడ్ కాగా, జూన్ 2023లో సినిమా రిలీజ్ కు సిద్ధమవ్వబోతోంది.

Tags

Read MoreRead Less
Next Story