Actor Vikram: ఆసుపత్రి నుండి విక్రమ్ డిశ్చార్జ్.. సెల్ఫీ వీడియో రిలీజ్..

Actor Vikram: నటుడు విక్రమ్ ఆకస్మిక అస్వస్థత కారణంగా జూలై 7 శుక్రవారం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. అప్పటినుండి తన ఆరోగ్య సమస్యపై రకరకాల రూమర్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. వాటిపై తన కుటుంబ సభ్యులు స్పందించింది.. విక్రమ్‌కు ఏమీ కాలేదని బాగానే ఉన్నాడని చెప్పారు. అయినా ఫ్యాన్స్ మనసు కుదుటపడలేదు. దీంతో విక్రమే స్వయంగా ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
విక్రమ్ విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో తన ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేశారు. తన కోసం ప్రార్థించిన అభిమానులకు, తనపై ప్రేమాభిమానం చూపించినవారికి ధన్యవాదాలు తెలిపారు. తనపట్ల అభిమానులు చూపించిన ప్రేమకు సంతోషంగా ఉందని చెప్పారు విక్రమ్. ఇక విక్రమ్ ఆసుపత్రిలో చేరడం వల్ల మణిరత్నం తెరకెక్కించిన 'పొన్నియిన్ సెల్వన్' టీజర్ లాంచ్‌కు తాను హాజరు కాలేకపోయాడు.
పొన్నియిన్ సెల్వన్‌తో పాటు విక్రమ్ నటిస్తున్న మరొక సినిమా 'కోబ్రా'. ఈ మూవీ ఆగస్ట్ 11న విడుదలకు సిద్ధమవుతుంది. అయితే పొన్నియిన్ సెల్వన్ ఈవెంట్‌కు హాజరు కాలేకపోయిన విక్రమ్.. నేడు జరగనున్న కోబ్రా ఆడియో లాంచ్ ఈవెంట్‌కు ఎలాగైనా హాజరు కావాలని అనుకుంటున్నట్టు సమాచారం. విక్రమ్ డెడికేషన్ గురించి ప్రేక్షకులకు తెలిసిన విషయమే. అందుకే తన ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
#ChiyaanVikram Sir is Discharged for today !♥️🙏🏽
— ChiyaanMathanCvf (@mathanotnmcvf) July 9, 2022
Waiting to see #CobraAudioLaunch pic.twitter.com/oDUPlJmebl
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com