Cobra Teaser: 'కోబ్రా' టీజర్ విడుదల.. మ్యాథ్స్‌తో క్రైమ్స్ చేసే హీరో కథ..

Cobra Teaser: కోబ్రా టీజర్ విడుదల.. మ్యాథ్స్‌తో క్రైమ్స్ చేసే హీరో కథ..
Cobra Teaser: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్‌ను వెండితెరపై చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Cobra Teaser: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్‌ను వెండితెరపై చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విక్రమ్ స్క్రీన్‌పై కనిపించి చాలాకాలమే అయ్యింది. అయితే కొన్నాళ్లుగా విక్రమ్.. అన్నీ క్రైమ్, థ్రిల్లర్ జోనర్లలోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కమర్షియాలిటీని పూర్తిగా పక్కన పెట్టేశాడు. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ అంశంతో విక్రమ్ అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యాడు.

విక్రమ్ ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్, కోబ్రా చిత్రాల్లో నటిస్తున్నాడు. దీంతో పాటు మరో రెండు చిత్రాలకు కూడా ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటీవల స్వల్ప అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో అడ్మిట్ అయిన విక్రమ్.. మళ్లీ వెంటనే కోలుకొని షూటింగ్స్‌కు, ఈవెంట్స్‌కు హాజరవుతున్నాడు. ఇక విక్రమ్ అప్‌కమింగ్ మూవీ 'కోబ్రా' టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'కోబ్రా'లో విక్రమ్ యాక్షన్ కూడా చూపించాడు. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. అయితే ఇది కేవలం యాక్షన్ సినిమానే కాదని.. ఇందులో విక్రమ్ చాలా తెలివైన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే విక్రమ్ ఇతర చిత్రాలలాగానే ఇది ఒక ఇంట్రెస్టింగ్ పజిల్ అని అనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story