Vishnu Vishal: రణవీర్ బాటలో మరో హీరో.. సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటోషూట్స్ ట్రెండ్..

Vishnu Vishal: ప్రస్తుతం సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటోషూట్స్ ట్రెండ్ నడుస్తోంది. మామూలుగా హీరోయిన్ల ఫోటోషూట్స్ ఈజీగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. కానీ ఇప్పుడు హీరోల వంతు వచ్చేసింది. అది కూడా మామూలు ఫోటోషూట్ కాకుండా న్యూడ్ ఫోటోషూట్స్‌తో హీరోలు షాకిస్తున్నారు. తాజాగా రణవీర్ సింగ్‌ను చూసి మరో తమిళ హీరో కూడా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతూ పోస్ట్ పెట్టాడు.
ఇటీవల విజయ్ దేవరకొండ.. తన అప్‌కమింగ్ మూవీ లైగర్ కోసం న్యూడ్ ఫోటోషూట్ చేశాడు. ఇక తాజాగా రణవీర్ సింగ్.. ఓ మ్యాగజిన్ కోసం నగ్నంగా ఫోటోలు దిగి సంచలనం సృష్టించాడు. ఇదే ట్రెండ్ అనుకొని మరో హీరో కూడా ఇందులో జాయిన్ అయ్యాడు. తనే విష్ణు విశాల్. 'రత్సాసన్' లాంటి సినిమాలతో బ్లాక్‌బస్టర్ అందుకొని ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులో కూడా చిత్రాలు చేస్తూ ఇక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు ఈ హీరో.
కొన్నాళ్ల క్రితం విష్ణు విశాల్.. బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తాను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తను తీసిన ఫోటోలనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. 'ట్రెండ్‌లో జాయిన్ అవుతున్నాను. గమనిక: భార్య జ్వాలా గుత్తా ఫోటోగ్రాఫర్ అయినప్పుడు' అని తన ఫోటోలకు క్యాప్షన్ పెట్టి.. న్యూడ్ ఫోటోషూట్‌ను పోస్ట్ చేశాడు విష్ణు విశాల్. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకా ఎంతమంది హీరోలు ఈ న్యూడ్ ఫోటోషూట్ ట్రెండ్‌ను ఫాలో అవుతారో చూడాలి మరి.
Well... joining the trend !
— VISHNU VISHAL (VV) (@TheVishnuVishal) July 23, 2022
P.S
Also when wife @Guttajwala turns photographer... pic.twitter.com/kcvxYC40RU
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com