Web Series : పాన్ ఇండియా స్ధాయిలో 'ఆర్ యా పార్'...

Web -series : పాన్ ఇండియా స్ధాయిలో ఆర్ యా పార్ వెబ్ సిరీస్
ఈ ఏడాది మరో రెండు, మూడు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరోలందరూ సంక్రాంతికే బరిలోకి దిగేందుకు సిద్ధమవ్వగా, చిన్న చిత్రాలు, డబ్బింగ్ సినిమా మాత్రం రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇక ప్రేక్షకులను అలరించేందుకు వెబ్ సిరీస్ లతో ప్రముఖ ఓటీటీలు కూడా సిద్ధమయ్యాయి.
ఇక డిసెంబర్ 30న డిస్నీ+ హాట్‌స్టార్ లో రీలీజ్ కు రెడిగా ఉన్న పాన్ ఇండియన్ వెబ్ సిరీస్ 'ఆర్ యా పార్'.ఇప్పటికే రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ అన్నీ భాషల్లోనూ ఆకట్టుకుంది. హై పేస్డ్ యాక్షన్ డ్రామా గా విడుదల కాబోతున్న ఈ సిరీస్ లో ఆదిత్య రావల్, పత్రలేఖ, సుమీత్ వ్యాస్, ఆశిష్ విద్యార్థి, దిబ్యేందు భట్టాచార్య, ఆసిఫ్ షేక్, శిల్పా శుక్లా, వరుణ్ భగత్, నకుల్ సెహ్‌దేవ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇక ఆదిత్య రావల్ పోషించిన సర్జూ ప్రయాణమే ఈ సిరీస్ గా చెప్పవచ్చు. కథ విషయానికి వస్తే, విలువిద్యలో అద్భుతమైన ప్రతిభ ఉన్న గిరిజన వ్యక్తి, తన తెగను కాపాడుకుంటూ, తమ మనుగడ కోసం ఆధునిక ప్రపంచం, దాని అవినీతి రాజకీయ, ఆర్థిక యంత్రాంగానికి వ్యతిరేకంగా పోరాడుతూ కిరాయి హంతకుడుగా మారుతాడు.
అంతేకాకుండా తమ తన భూమిని, తన ప్రజలను రక్షించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేసేలా హీరో కనిపిస్తాడంటూ నటుడు ఆదిత్య రావల్ తెలుపాడు. ఇక తన లక్ష్యాన్ని సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తాడని, అలా ఆ ప్రయాణంలో ఎదురయే సవాళ్లను ఏవిధంగా ఎదుర్కొంటాడు అనేదే స్టోరీ అని చెప్పుకొచ్చాడు. మరి ఈ పాన్ ఇండియన్ వెబ్ సిరీస్ ఏలాంటి సక్సస్ ను అందుకుంటుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com