Yash Shankar Movie : శంకర్ డైరెక్షన్లో యశ్ సినిమా.. బడ్జెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Yash Shankar Movie : కేజీఎఫ్ తరువాత యష్ బాస్ మరో భారీ ప్రాజెక్ట్‌తో మనముందుకు వస్తున్నాడు. టాప్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీని తెరకెక్కించనున్నారు. బడ్జెట్ విషయానికి వస్తే.. ఇండియన్ సినిమాలో ఇక ముందెన్నడూ లేని భారీ పెట్టుబడితో నిర్మించనున్నారు. సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుంది. కరణ్ జోహార్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా, పెన్ మీడియా కలిసి దీన్ని నిర్మించనున్నారు. కథల్ని ఇష్టపడి చదివేవారికి ఈ సినిమా కథను వినేసి ఉంటారు.
ప్రముఖ తమిళ రచయిత సు.వెంకటేశన్ రాసిన 'వల్పరి' నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం దర్శకుడు శంకర్.. ఇండియన్ 2, ఆర్‌సీ15 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు తరువాత యశ్‌తో కలిసి పనిచేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీటి గురించి మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల కాలేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com