777 Charlie Review: '777 చార్లీ' రివ్యూ.. మనసుకు హత్తుకుపోయే పెట్ కథ..
777 Charlie Review: 777 చార్లీ.. చార్లీ అనే ఓ పెట్ డాగ్ గురించి చెప్పే కథ. కన్నడ యంగ్ హీరో రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో రానా ప్రెజెంట్ చేశాడు. నేచురల్ స్టా్ర్ నాని నటించిన 'అంటే సుందరానికీ' చిత్రానికి పోటీగా 777 చార్లీ చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటేనే చాలామంది పెట్ లవర్స్‌కు ఈ మూవీ కనెక్ట్ అయిపోయేలా అనిపించింది. మరి ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా లేదా?
ధర్మ (రక్షిత్ శెట్టి) లైఫ్‌లోకి అనుకోకుండా ఓ రోజు చార్లీ అనే ఓ కుక్క వస్తుంది. మొదట్లో ధర్మకు తనతో ఉండడం నచ్చకపోయినా.. మెల్లగా వారిద్దరూ దగ్గరవుతారు. చార్లీ వల్లే ధర్మ జీవితం పూర్తిగా మారిపోతుంది. తను జీవితాన్ని చూసే దృష్టి కూడా మారిపోతుంది. ఇక క్లైమాక్స్ అయితే ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించేలా ఉంది. దీంతో 777 చార్లీకి అంతటా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.
పెట్ లవర్స్‌కు ఈ సినిమా మరింత ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. అంతే కాకుండా ప్రేమకు భాష లేదు అని చార్లీ అనే పాత్ర ద్వారా తెలియజేయడానికి ప్రయత్నించిన దర్శకుడు కిరణ్‌రాజ్ కె సక్సెస్ అయ్యాడు. ఏ సినిమాకు అయినా.. క్లైమాక్సే కీలకం. 777 చార్లీ క్లైమాక్స్ అయితే చూసినవారికి చాలాసేపు గుర్తుండిపోయేలా ఉంటుంది. ఎమోషన్స్‌తో పాటు ప్రతీ నిమిషం ఆసక్తిగా 777 చార్లీ సినిమా కొనసాగుతుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com