Anaganaga Okaraju Review : అనగనగా ఒకరాజు మూవీ రివ్యూ

Anaganaga Okaraju Review :  అనగనగా ఒకరాజు మూవీ రివ్యూ
X

రివ్యూ : అనగనగా ఒకరాజు

ఆర్టిస్ట్స్ : నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌధరి, రావు రమేష్, చమ్మక్ చంద్ర, తారక్ పొన్నప్ప తదితరులు

సంగీతం : మిక్కీ జే మేయర్

సినిమాటోగ్రఫీ : జే. యువరాజ్

నిర్మాతలు : నాగవంశీ, సాయి సౌజన్య

దర్శకత్వం : మారి

నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన మూవీ అనగనగా ఒకరాజు. దాదాపు రెండేళ్ల తర్వాత పూర్తయింది ఈ మూవీ. అందుకు అతనికి యాక్సిడెంట్ కారణం. అందునుంచి కోలుకుని తర్వాత చేశాడు. ఇందుకోసం కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్నా.. సంక్రాంతికి సరైన టైమ్ కు విడుదల చేశారు. మీనాక్షి చౌధరి హీరోయిన్ గా నటించింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

రాజు (నవీన్ పోలిశెట్టి ) ఒక జమీందార్. కానీ అతని తాత కారణంగా ఆస్తులన్నీ పోగొట్టుకుంటాడు. ఎలాగైనా ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. చారులత(మీనాక్షి చౌధరి) బాగా డబ్బున్న అమ్మాయి. ఆమె తండ్రి ( రావు రమేష్) ఆమెకు ఓ మంచి అబ్బాయితో పెళ్లి చేయాలనుకుంటాడు. రాజు, చారులతను చూసి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో రకరకాల ఎత్తులు వేసి ఆ అమ్మాయిని పడేస్తాడు. తర్వాత పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్లి రోజే ఆమె డబ్బున్న అమ్మాయి కాదని తెలుసుకుంటాడు. ఆమె తండ్రి భారీగా అప్పులు చేసి పారిపోతాడు. ఆ అప్పులు కట్టాల్సిన పరిస్థితికి రాజుకు వచ్చింది. మరి ఆ తర్వాత ఏమైంది..? అతని అప్పులు తీరతాయా..? ఈ ప్రయత్నంలో ఆ ఊరి సర్పంచ్ తో అతను ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ.

ఎలా ఉంది :

అనగనగా ఒకరాజు అనే కథగా చూస్తే నవీన్ పోలిశెట్టి ఒన్ మేన్ షోలా ఉంది. అతనే అంతా చూసుకున్నాడు. సింగిల్ హ్యాండెడ్ గా కథనం మొత్తం మీదేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో ఒకలా, సెకండ్ హాఫ్ లా ఒకలా ఉంది మూవీ. మొదటి సగం మీనాక్షిని పడేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. సెకండ్ హాఫ్ లో అతని మామ అప్పులు తీర్చేందుకు ఓ ప్రయత్నం చేస్తాడు. అదేంటీ అనేది ఈ రివ్యూలో చెప్పడం కుదరదు. అయితే అతని పాత్ర రెండు రకాలుగా కనిపిస్తుంది. అలాగే మీనాక్షి పాత్ర కూడా అలాగే కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కాలేజ్ అమ్మాయిలా సెకండ్ హాఫ్ లో వైఫ్ గా కనిపిస్తుంది. రెండు విధాలుగా ఆకట్టుకుంటుంది. జమీందార్ గా నవీన్ పాత్ర బాగా ఆకట్టుకుంటుంది. అతనే పేద జమీందార్ లా ఉంటూ.. ఊరోళ్లకు ఆ విషయం తెలియకుండా మెయిన్టేన్ చేయడం నవ్విస్తుంది. అలాగే ఛమ్మక్ చంద్ర పాత్ర కూడా బావుంది. బాగా ఆకట్టుకున్నాడు. సినిమా అంతా కనిపిస్తాడు. నవీన్ కు పనోడులా కనిపిస్తాడీ పాత్రలో. రావు రమేష్ పాత్ర చిన్నదే కానీ బాగా ఆకట్టుకుంది. నటన బావుంది. విలన్ పాత్రలో తారక్ పొన్నప్ప మెప్పించాడు.

స్క్రీన్ ప్లే పరంగా ఇంకాస్త బలంగా రాసుకుని ఉండాల్సింది అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో. ఈ పాత్రను మార్చేలా కనిపించడం బలంగా రాత కనిపించదు. అయినా సంక్రాంతి బరిలో విడుదలైన ఈ మూవీ ఆ మేరకు ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. అప్పుడప్పుడు బాధపెడుతుంది. డబ్బు కోసం ఎవరూ ఎవరినీ పెళ్లి చేసుకోకూడదు అనేలా ఓ సందేశం కూడా కనిపిస్తుంది.

టెక్నికల్ గా మిక్కీ జే మేయర్ మ్యూజిక్ బావుంది. పాటలు బావున్నాయి. యువరాజు సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా కనిపిస్తాయి. ఓ రకంగా నిర్మాణమే ఓ హైలెట్ లా ఉంది. దర్శకుడుగా మారి మెప్పించాడు. రచన పరంగా ఇంకాస్త బలంగా ఉండాల్సింది అనేలా ఉంది. అంటే రచన విషయంలో నవీన్ పోలిశెట్టి హ్యాండ్ కూడా ఉంది. మొత్తంగా ఆకట్టుకునే మూవీతో వచ్చాడు మారి.

ఫైనల్ గా : రాజు గారు నవ్వించాడు

రేటింగ్ : 3/5

బాబురావు కామళ్ల

Tags

Next Story