'శుక్ర' రివ్యూ.. గ్రిప్పింగ్ థ్రిల్లర్..!

"శుక్ర" రివ్యూ -
నటీనటులు - అరవింద్ కృష్ణ, శ్రీజిత గోష్, విశాల్ రాజ్, సంజీవ్, ఈషా శెట్టి, జస్ ప్రీత్, పూజ, చాందినీ, కమలాకర్, రుద్ర తదితరులు
సాంకేతిక నిపుణులు :
సంగీతం - ఆశీర్వాద్
కాస్ట్యూమ్ డిజైనర్ - రియా పూర్వజ్
సినిమాటోగ్రఫీ - జగదీశ్ బొమ్మిశెట్టి
నిర్మాతలు - అయ్యన్న నాయుడు నల్ల, తేజ్ పల్లె
రచన దర్శకత్వం - సుకు పుర్వజ్
పెద్ద ఇమేజ్ లు లేకపోయినా ప్రేక్షకుల్ని ట్రైలర్ తో ఆకట్టుకున్న శుక్ర మూవీ.. థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి ఛాయిస్ గా మారింది. యూత్ ని ఎట్రాక్ట్ చేసే బోల్డ్ కంటెంట్ తో పాటు ఆసక్తికరంగా అనిపించిన మేకింగ్ శుక్ర సినిమా పై అంచనాలను పెంచింది. అరవింద్ కృష్ణ ఇప్పటి వరకూ కనిపించిన పాత్రలకు భిన్నంగా కనిపించిన శుక్ర మూవీ ఎలా ఉందో చూద్దాం..
కథ ఎంటంటేః
యూత్ పార్టీలలో డ్రగ్స్ వినియోగం పెరుగుతుందనే వార్తలు చాలా సాధారణంగా వింటుంటాం.. అదే థీమ్ తీసుకున్నాడు దర్శకుడు సుకు పుర్వజ్. వైజాగ్ నగరంలో థగ్స్ అనే మాఫియా ముఠా వరుస నేరాలకు పాల్పడుతుంటుంది. డబ్బున్న కుటుంబాలను హతమార్చి లూటీలు చేస్తుంటారు. నగరం నేరమయంగా ఉన్నప్పుడు ఇక్కడికి భార్యతో కలిసి వస్తాడు విల్లి. విలియమ్ అలియాస్ విల్లి (అరవింద్ కృష్ణ) ఒక బిజినెస్ మెన్. సొంత కంపెనీ నడుపుతుంటాడు. అతని అందమైన వైఫ్ రియా (శ్రీజిత ఘోష్). విల్లి బిజీ లైఫ్ వల్ల వైజాగ్ వచ్చాకే ఈ జంటకు ప్రైవసీ దొరుకుతుంది. భర్త తనతో ఎక్కు టైమ్ స్పెండ్ చేయాలని రియా కోరిక. తన బర్త్ డేకు హౌస్ పార్టీ కావాలని విల్లిని కోరుతుంది రియా. అలా తన క్లోజ్ ఫ్రెండ్స్ అంతా కలిసి విల్లీ రియా ఇంట్లో పార్టీ చేసుకుంటారు. ఈ పార్టీ జరిగిన రాత్రి అనూహ్యంగా రియా, మరో ఇద్దరి హత్యలు జరుగుతాయి. ఈ హత్యలు చేసిందెవరు, హత్యలకు కారణం ఏంటి, తన భార్యను, స్నేహితులను చంపిన ఆ నేరస్తుడిని విల్లి ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కథ.
కథనం..
హిందీ లో ఉడ్తా పంజాబీ వచ్చినప్పుడు జరిగిన చర్చ అందరికీ తెలుసు.. శుక్ర మూవీ లోకూడా అలాంటి సమస్యనే బ్యాక్ డ్రాప్ తీసుకున్నాడు. నగర శివారులో నివసించే ధనవంతుల కుటుంబాలను టార్గెట్ చేసే ఒక భయంకరమైన న గ్యాంగ్ ను పరిచయం చేసిన దర్శకుడు కథను ఇంట్రెస్ట్ గా కనెక్ట్ చేసాడు. ఇక విల్లీ క్యారెక్టర్ లో అరవింద కృష్ణ చాలా బాగా చేసాడు. తన క్యారెక్టర్ లొని గ్రే షేడ్ ను బాగా మెయిన్ టైన్ చేసాడు. పెరుగుతన్న డ్రగ్ కల్చర్ ని పార్టీ కల్చర్ ని బాగా ప్రజెంట్ చేసాడు దర్శకుడు. యూత్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ మిస్ అవకుండా కథనం సాగుతుంది. నేర ప్రవృత్తికి బీజం పడే పార్టీ కల్చర్ ని తెరమీద బాగా ఎస్టాబ్లిష్ చేసాడు.
అలాగే భార్య భర్తల మద్య పెరుగుతన్న దూరం దగ్గర చేసేందుకు పార్టీలు ఒక ఆప్షన్ గా ఎలా మారాయో బాగా కనెక్ట్ చేసాడు దర్శకుడు. విల్లి, రియా మధ్య సాగే రొమాంటిక్ సీన్స్ సరదాగా సాగుతుంటాయి. ఇంటర్వెల్ కు వచ్చే ట్విస్ట్ సెకండాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. 2 వేల రూపాయల వజ్రాల స్మగ్లింగ్ ఈ హత్యలకు కారణం అని తెలిసినప్పడుు కథ మీద అంచనాలు మరింత పెరుగుతాయి. ప్రతి సీన్ కు ఎడిటింగ్ లో వేసిన డిస్క్రిప్షన్స్ కొత్తగా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ జగదీశ్ బొమ్మిశెట్టి తన కెమెరా పనితనం బాగుంది.
నటీనటుల పర్మార్మెన్స్ విషయానికొస్తే.. విల్లి క్యారెక్టర్ అంటే అరవింద్ కృష్ణ గుర్తొచ్చేలా నటించాడు. భార్యతో సరదాగా ఉన్న రొమాంటిక్ సీన్స్ లో మ్యాన్లీగా కనిపించాడు. ఒక బిజినెస్ మేన్ గా ప్రొఫెషనల్ బాడీ లాగ్వేజ్ చూపించాడు. తన బెటర్ హాఫ్ హత్యకు గురయినప్పుడు ఎమోషనల్ సీన్స్ లో అరవింద్ సహజంగా నటించి మెప్పించాడు. రియా క్యారెక్టర్ లో శ్రీజిత న బెస్ట్ పర్మార్మెన్స్ ఇచ్చింది. డబుల్ గ్లామర్ డోస్ ఇచ్చి, ట్రెండీ హీరోయిన్ అనేలా చేసింది. మెయిన్ లీడ్ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, పోలీస్ క్యారెక్టర్స్ చేసిన నటీనటులు అంతా తమ పాత్రల పరిధి మేరకు కన్విన్సింగ్ గా నటించారు.
థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి శుక్ర తప్పకుండా నచ్చే అంశాలున్నాయి. బోల్డ్ కంటెంట్ తో పాటు గ్రిప్పింగ్ సాగే కథనం శుక్ర ను మరింత యూత్ ఫుల్ గా మార్చింది.
చివరిగాః
యూత్ పుల్ శుక్ర...
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com