Bhartha Mahasayulaku Wignyapthi : భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ

Bhartha Mahasayulaku Wignyapthi :  భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ
X

రివ్యూ : భర్త మహాశయులకు విజ్ఞప్తి

ఆర్టిస్ట్స్ : రవితేజ, అషికా రంగనాథ్, డింపుల్ హయాతి, వెన్నెల కిశోర్, సునిల్, సత్య, తారక్ పొన్నప్ప తదితరులు

ఎడిటర్ : ఏ శ్రీకర్ ప్రసాద్

సంగీతం : భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల

నిర్మాత : సుధాకర్ చెరుకూరి

దర్శకత్వం : కిశోర్ తిరుమల

మాస్ మహరాజ్ మూవీస్ అంటే ఓ రకంగా అయిపోయిన రోజులివి. అతని మూవీస్ మాగ్జిమం బోర్ కొట్టేస్తున్నాయి. ఈ దశలో అతను కొత్త మూవ్ తీసుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ వైపు వెళ్లాడు. భర్తలకు మహాశయులకు విజ్ఞప్తి అనే మూవీతో వచ్చాడు. కిశోర్ తిరుమల దర్శకుడు. చాలా తక్కువ టైమ్ లో కంప్లీట్ చేసిన ఈ మూవీ సంక్రాంతి బరిలో ఈ నెల 13న విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది చూద్దాం.

కథ :

రామ సత్యనారాయణ (రవితేజ) ఓ బిజినెస్ మేన్. అతని భార్య బాలమణి( డింపుల్ హయాతి). అతను అనార్కలి ఓ వైన్ బ్రాండ్ తయారు చేస్తాడు. దానిపై పేరెంట్ రైట్స్ కోసం స్పెయిన్ లో ఉండే మానస శెట్టిని ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో అతనూ స్పెయిన్ వెళతాడు. తను ఆ బ్రాండ్ పర్సన్ అని వేరే చెప్పి మానసకు దగ్గరవుతాడు. ఈ క్రమంలో ఆమెతో శారీరకంగా కలుస్తాడు. ఆ పేటెంట్ వస్తుంది. ఆమె స్పెయిన్ లో ఉండిపోతుంది అని భావించిన రామ సత్యనారాయణ హ్యాపీగా హైదరాబాద్ వెళతాడు. కట్ చేస్తే మానస అతని కోసం వస్తుంది. దీంతో అతనికి పెళ్లైన దాచిన విషయం తెలుస్తుందనే భయంతో ఉండిపోతాడు. మరోవైపు ఈయనకు ప్రియురాలు ఉంటే భార్య నుంచి వచ్చే రియాక్షన్ భరించలేడు. మరి ఈ క్రమంలో చివరికి ఏమవుతుంది. భార్య భర్తలు విడిపోతారా.. లేక ప్రియుడు ప్రియురాలు కలుస్తారా అనేది మిగతా కథ.

ఎలా ఉంది :

భర్తలకు మహాశయులకు విజ్ఞప్తి కథేంటీ అనేది ముందు నుంచీ చెబుతున్నాడు దర్శకుడు. టీజర్, ట్రైలర్ తోనే తేలిపోయింది. మరి కథనం ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానం ఇది. ఇలాంటి కథలు తెలుగులో కొత్తేం కాదు. బట్ ఆ మూవీస్ కు ఇచ్చే ట్రీట్మెంట్ మాత్రం కొత్తగా ఉండాలి. ఈ ప్రయత్నంలో మాగ్జిమం సక్సెస్ అయింది భర్తలకు మహాశయులకు విజ్ఞప్తి. రవితేజ ఇమేజ్ కు భిన్నంగా ఉండే కథ, ఆకట్టుకునే కథనం.. అందమైన హీరోయిన్లు, కామెడీ, ఆకట్టుకునే పాటలు ఇవి చాలు కదా. సంక్రాంతి సందర్భంగా సరదాగా సాగిపోయే సినిమాలకు. ఇదే ఈ దర్శకుడు కూడా నమ్మింది అదే. అందుకే ఈ మూవీ ఎక్కడా భారీగా కనిపించకుండా.. ఊహించే కథనం అయినా ఆకట్టుకునే సన్నివేశాలతో మెప్పించాడు. ఫస్ట్ హాఫ్ లో మాగ్జిమం స్పెయిన్ లో సాగుతుంది. తర్వాత హైదరాబాద్ కు వచ్చిన తర్వాత మరో లొకేషన్ కు వెళ్లకుండా అల్లుకున్న కథనం ఎక్స్ పెక్టింగ్ లా ఉంటుంది. ఇదో ప్లస్ పాయింట్ లా ఉంది. ఆరనీకుమా ఈ దీపం అనే రీమిక్స్ సాంగ్ మాత్రం అదిరిపోయింది. అదే కాకుండా ఇంకొన్ని పాత పాటలు కూడా సందర్భాను సారంగా ఆకట్టుకుంటాయి. సింపుల్ నెరేషన్ తో ఊహించే కథ అయినా ఆకట్టుకునే కథనంతో మాత్రం మెప్పించిందీ మూవీ. అలాగని గొప్పగా ఉంది అని కూడా చెప్పలేం. అలా సాగిపోయే సినిమా. సంక్రాంతి సందర్భంగా అలరించే సన్నివేశాలతో మెప్పించే మూవీ అవుతుంది.

అజయ్ ఘోష్ తో రెండు ఫైట్ సీన్స్ ఎందుకు ఉన్నాయి తెలియదు. దానికి ఏ రీజన్ లేకపోవడం దర్శకత్వ లోపం అవుతుంది. పాత కథే అయినా కథనం అక్కడక్కడా లాగ్ అవుతుంది. కొన్ని సీన్స్ చాలా పాతగా ఉంటాయి. అదేఈ మూవీకి సంబంధించిన మైనస్ పాయింట్స్. మిగతా అంతా పాత కథే అయినా కొత్తగా ఉండే కథనంలా ఉండిపోతుంది.

నటన పరంగా రవితేజ ఎనర్జిటిక్ గానే ఉన్నాడు. తనకు అలవాటైన కథైనా అలరించాడు. ఇద్దరు ఆడవాళ్ల మధ్య నలిగిపోయిన వాడులా కనిపించి ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ లో కూడా భారీగా లేకుండా ఉండటం ప్లస్ పాయింట్ అవుతుంది. అషికా రంగనాథ్ అదరగొట్టింది. చాలా అందంగా ఉంది. ఈ గ్లామర్ రోల్ లో కావాల్సినంత కనువిందు చేసింది. డింపుల్ హయాతీ ఫ్యామిలీ లేడీ పాత్ర. ఆకట్టుకునేలానే ఉంది. సునిల్, వెన్నెల కిశోర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగానూ, కమెడియన్స్ లానూ బావున్నారు. సత్య చాలా చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. నవ్వించడం అటుంచి చిరాకు పెట్టాడు. తారక్ పొన్నప్ప ఊహించే పాత్ర. ఇతర పాత్రలన్నీ టైమ్ కు తగ్గట్టుగా సాగిపోయాయి.

టెక్నికల్ గా భీమ్స్ సిసిరోలియో సంగీతం హైలెట్. పాటలు, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది.రవితేజ మూవీ అంటే అతను కావాల్సినంత సరుకుతో వచ్చినట్టుగా కనిపించాడు. సినిమాటోగ్రఫీ మోస్ట్ బ్యూటీఫుల్ గా ఉంది. డైలాగ్స్ ఓకే. కాస్ట్యూమ్స్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. దర్శకత్వ పరంగా కిశోర్ తిరుమల స్థాయిలో కనిపించలేదు. అలాగని ఆ స్థాయిని తగ్గించుకునేలా మాత్రం లేడు. ఈ తరహాలో ఇలాంటి కథనాలు మామూలే అంతే అన్నట్టుగా ఉండిపోయింది. అంతే.

ఫైనల్ : భర్తలు మహాశయులకు విజయం

రేటింగ్ : 3/5

బాబురావు. కామళ్ల

Tags

Next Story