అదరగొట్టనున్న మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ 1
హాలీవుడ్ సూపర్ స్టార్ ట్రామ్ క్రూజ్ హీరోగా స్కైడ్యాన్స్, టీసీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై క్రిస్టఫర్ మాక్వరీ దర్శకత్వంలో టామ్ క్రూజ్ స్వయంగా నిర్మించిన చిత్రం మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ 1. సినిమాను రోమ్ నగరంలో జూన్ 20వ తేదీన ప్రీమియర్‌గా ప్రదర్శించారు. ఈ సినిమాకు భారీ రెస్సాన్స్ వస్తున్నది. ఈ సినిమాపై క్రిటిక్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బ్రూస్ గెల్లెర్ రూపొందించిన మిషన్: ఇంపాజిబుల్ చిత్రం ఆధారంగా రూపొందింది. రోమ్ నగరంలో ఈ సినిమా ప్రివ్యూ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మిషన్ ఇంపాజిబుల్: ఫాలౌట్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందించారు. టామ్ క్రూజ్, హేలే అట్‌వెల్, వింగ్ రామేస్, షిమోన్ పెగ్, రెబెకా ఫెర్గ్యూసన్, ఎసై మోరేలెస్, వెనెస్పా కిర్బీ తదితరులు ఈ సినిమాలు నటించారు. ఈ సినిమాను జూలై 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.
మానవాళిని అంతం చేసే దుష్ట శక్తులను ప్రయత్నాలను విఫలం చేసేందుకు ఎథాన్ హంట్ అంటే టామ్ క్రూజ్ తన ఐఎంఎఫ్ టీమ్‌తో రంగంలోకి దిగుతాడు. మానవాళి వినాశనికి సిద్దం చేసిన డేంజరస్ ఆయుధాన్ని కనుకొనేందుకు ఈ టీమ్ రేస్‌ను మొదలుపెడుతుంది. దుష్ట శక్తులపై ఎథాన్ హంట్ ఎలా విజయం సాధించాడనేది కథగా రూపొందింది.
ఈ సినిమా గురించి స్క్రీన్ రైటర్ జోసెఫ్ డెకెల్‌మియర్ మాట్లాడుతూ ఈ సినిమా చాలా గొప్పగా ఉందన్నారు మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో ఇది తన నాకు ఫేవరేట్ అని, ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటలెజిన్స్ ప్రధాన విలన్‌గా ఉందన్నారు. యాక్షన్ సీన్లు, ట్రైన్ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది అని అన్నారు. ఈ ప్రీమియర్ కు టామ్ క్రూజ్ కూడా హాజరయ్యారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com