రివ్యూ

ET Movie Review: 'ఈటీ' మూవీ రివ్యూ.. తన యాక్టింగ్ సినిమాకు మైనస్..

ET Movie Review: దాదాపు రెండేళ్ల తర్వాత హీరో సూర్య.. తన ఫ్యాన్స్‌ను థియేటర్లలో పలకరించాడు.

ET Movie Review: ఈటీ మూవీ రివ్యూ.. తన యాక్టింగ్ సినిమాకు మైనస్..
X

ET Movie Review: దాదాపు రెండేళ్ల తర్వాత హీరో సూర్య.. తన ఫ్యాన్స్‌ను థియేటర్లలో పలకరించాడు. తన ముందు సినిమాలు 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్'.. ఓటీటీలో విడుదలయినా కూడా సూపర్ హిట్ టాక్‌ను అందుకున్నాయి. ఇప్పుడు 'ఎవరికీ తలవంచడు' మూవీతో థియేటర్లలో సందడి మొదలుపెట్టాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది?

కథ

లాయర్ కృష్ణమోహన్ (సూర్య) చిన్నప్పుడే తన చెల్లెలిని కోల్పోతాడు. అప్పటినుండి ప్రతీ ఒక్క అమ్మాయిని తన చెల్లిలిగా భావించి వారిని కాపాడుతూ ఉంటాడు. అదే సమయంలో తన ఊరిలో చాలామంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉంటారు. అసలు వీరందరు ఎందుకు ఇలా చనిపోతున్నారు, ఎవరు వీరి బలవంతపు మరణాలకు కారణం అనేది కథ.

విశ్లేషణ

జై భీమ్‌లో లాయర్‌గా ఇంప్రెస్ చేసిన సూర్య.. మరోసారి అదే పాత్రతో శభాష్ అనిపించుకున్నాడు. సూర్య ఎప్పుడైనా పూర్థిస్థాయిలో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసి.. చాలావరకు సక్సెస్ అవుతాడు కూడా. ఈసారి కూడా అంతే. అయితే హీరోయిన్‌గా నటించిన ప్రియాంక మోహన్ మాత్రం తన నటనకు ఇంకా స్కోప్ ఉన్నా.. ఎందుకో పూర్థిస్థాయిలో ఇంప్రెస్ చేయలేకపోయింది. అది సినిమాకు ఓ మైనస్. విలన్‌గా నటించిన వినయ్ రాయ్ మరోసారి తాను హీరోకంటే విలన్‌గానే బాగా సూట్ అవుతాడని ప్రూవ్ చేసుకున్నాడు.

మహిళా నేపథ్యం ఉన్న కథతో ఇప్పటికే సూర్య పలు సినిమాలు చేశాడు. వాటిలో చాలావరకు సూపర్ హిట్ అయ్యాయి కూడా. అందులో ఒకటి 'ఈటీ'. ఈ కథలోనే మాస్ ఎలిమెంట్స్‌ను కలిపి దర్శకుడు పాండిరాజ్ దీనిని ఒక కమర్షియల్ చిత్రంగా తీర్చిదిద్దాడు. సినిమాలో యాక్షన్ సీన్స్ అయితే యాక్షన్ లవర్స్‌కు ఫుల్ ఫీస్ట్‌లాగా ఉంటాయి. సెంటిమెంట్ కూడా ఈటీలో బాగానే ఫీల్ అయ్యేలా చేశాడు దర్శకుడు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES