Fear Movie : ఫియర్ మూవీ రివ్యూ

Fear Movie :  ఫియర్ మూవీ రివ్యూ
X

రివ్యూ : ఫియర్

తారాగణం : వేదిక, అరవింద్ కృష్ణ, జయ ప్రకాష్, పవిత్ర లోకేష్, అనీష్ కురువిల్లా, సాహితి దాసరి తదితరులు

ఎడిటర్ : హరిత గోగినేని

సంగీతం : అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫీ : ఐ ఆండ్ర్యూ

నిర్మాతలు : డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి

రచన, దర్శకత్వం : హరిత గోగినేని

కొన్ని సినిమాలు రిలీజ్ కు ముందే ప్రామిసింగ్ అనిపిస్తాయి. ఇలాంటివి ఎక్కువగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీస్. బట్ థ్రిల్లర్ జానర్ లో అలా అనిపించడం అరుదు. టీజర్, ట్రైలర్ తోనే ప్రామిసింగ్ అనిపించుకున్న మూవీ ‘ఫియర్’. డెబ్యూ డైరెక్టర్ హరిత గోగినేని రూపొందించిన ఈ మూవీలో వేదిక ప్రధాన పాత్రలో నటించింది. ఈ శనివారం విడుదల కాబోతోన్న మూవీ ప్రీమియర్స్ తో అద్భుతమైన అప్లాజ్ తెచ్చుకుంది. మరి ఈ మూవీ ఎలా ఉందనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

ఇందు, సింధు (వేదిక - డ్యూయొల్ రోల్) కవలలు. సింధుకు అక్కడ ఇందు అంటే చాలా ఇష్టం. కాకపోతే సింధుకు చిన్నప్పటి నుంచి కొన్ని భయాలు ఉంటాయి. ఎవరో తనను వెంటాడుతున్నటు భావిస్తుంది. ఇందుకు చెల్లి అంటే పెద్దగా నచ్చతు. తనని తరచూ తిడుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో అక్క వల్ల చెల్లి బాధపడుతూ ఉంటుంది. సింధు తన క్లాస్ మేట్ అయిన సంపత్ (అరవింద్ కృష్ణ)ను ప్రేమిస్తుంది. ఆ ప్రేమ కాస్త అతిగా మారి అతను తనకు మాత్రమే సొంతం అన్నట్టుగా భావిస్తుంది. తన అక్కడ అతనితో మాట్లాడినా సహించదు. అదే సమయంలో ఆమెలోని భయాలు మరిత పెరుగుతాయి. తననెవరో చంపడానికి వస్తున్నట్టు భయపడుతుంది. దీంతో ఆమెను మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు కుటుంబ సభ్యులు. ఆ సమయంలో తను ప్రేమించిన సంపత్ కనిపించకుండా పోతాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది. అయితే అతనే కావాలని పిచ్చిపట్టినట్టుగా హాస్పిటల్ లో ప్రవర్తిస్తుంటుంది సింధు. మరి సంపత్ ఏమయ్యాడు. ఇందు ఎక్కడికి వెళ్లింది.. ఇంతకీ సింధును భయపెడుతున్నది ఎవరు.. అనేది మిగతా కథ.

ఎలా ఉంది :

కొన్ని కథలు మన ఊహలకు తగ్గట్టుగా మొదలై.. అనూహ్యమైన మలుపులతో సర్ ప్రైజ్ చేస్తాయి. ఈ కథ కూడా అలాంటిదే. కథ చూసి ఎవరు ఎన్ని గెస్ చేసినా ఎవరి అంచనాలకూ అందని ట్విస్ట్ లతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. టైటిల్ కు తగ్గట్టుగానే హీరోయిన్ కే కాదు.. ఆడియన్స్ లోనూ ఓ ఫియర్ ను క్రియేట్ చేస్తుందీ మూవీ. అయితే ఇది డైరెక్టర్'స్ మూవీ. ఎంతో కమాండ్ ఉంటే తప్ప ఇలాంటి కథను ఇంత మెచ్యూర్డ్ గా డీల్ చేయలేరు. అందుకు ఎంతో అనుభవం కావాలి. బట్ ఫస్ట్ మూవీతోనే ది బెస్ట్ అనిపించుకుంది హరిత గోగినేని. తనకు ఇది ఫస్ట్ మూవీ అంటే నమ్మలేం. స్టోరీలోనే కాదు.. స్క్రీన్ ప్లే పైనా అంత కమాండ్ ఉంది తనకు. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో సాగుతూ.. ప్రతి సీన్ అద్భుతం అనిపిస్తుంది.

అసలు పాయింట్ ను ఆఖరు వరకూ సస్టెయిన్ చేస్తూ.. చివర్లో రివీల్ చేసిన ట్విస్ట్ అద్భుతం అనిపిస్తుంది. మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. ఈ విషయంలో మార్కులన్నీ డైరెక్టర్ హరిత గోగినేనికే పడతాయి. తను ఓ పాథ్ బ్రేకింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. మామూలుగా లేడీ డైరెక్టర్స్ లో ఎక్కువమంది ఫ్యామిలీ స్టోరీస్ తో పరిచయం అవుతారు. ఆ ట్రెండ్ ఇప్పుడిప్పుడే మారుతోంది. తాము కూడా ఇలాంటి మూవీస్ తీయగలం అని నిరూపించుకుంటున్నారు. చివర్లో ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఓ అద్భుతమైన సందేశం సైతం కనిపిస్తుంది.

ఇలాంటి క్యారెక్టర్ డ్రివెన్ మూవీస్ కు బలమైన ఆర్టిస్టులు అవసరం. ఈ విషయంలో వేదిక సరైన ఛాయిస్ అనిపిస్తుంది. ఇంకాస్త బలమైన నటి ఉంటే ఇంకా బావుండేదేమో అని అప్పుడప్పుడూ అనిపించినా.. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయడంలో వేదిక సక్సెస్ అయిందనే చెప్పాలి. డిఫరెంట్ ఎమోషన్స్, వేరియేషన్స్ ఉన్న పాత్ర ఇది. ఇలాంటి పాత్రలు చాలామందికి డ్రీమ్ రోల్స్ లా ఉంటాయి. ఆ ఎమోషన్స్ ను పలికించడంలో వేదిక ఓకే అనిపించుకుంటుంది. అరవింద్ పాత్ర చిన్నదే అయినా ఇంపాక్ట్ పెద్దది. మిగతా నటులంతా తమ పాత్రల పరిధి మేరకు పర్ఫెక్ట్ గా పర్ఫార్మ్ చేశారు.

సినిమాకు టెక్నికల్ గా మెయిన్ హైలెట్ అనూప్ రూబెన్స్ సంగీతం. నేపథ్య సంగీతం అదిరిపోయింది. పాటలు సైతం ఆకట్టుకుంటాయి. దర్శకులే ఎడిటర్స్ అయితే అవుట్ పుట్ ఎంత బెస్ట్ గా ఉంటుందో చెప్పడానికి హరిత ఓ ఎగ్జాంపుల్. పర్ఫెక్ట్ ఎడిటింగ్. సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. హరిత గోగినేని ఫియర్ తో తనలో ది బెస్ట్ స్టోరీ టెల్లర్ మాత్రమే కాదు బెస్ట్ టెక్నీషియన్ ఉందని ప్రూవ్ చేసుకుంది. తన టేకింగ్, మేకింగ్ చాలా ఎక్స్ పీరియన్స్ డ్ అన్నట్టుగా ఉన్నాయి.

ఫైనల్ గా : కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

రేటింగ్ : 2.75/5

Tags

Next Story