FIR Movie Review: 'ఎఫ్ఐఆర్' మూవీ రివ్యూ.. థ్రిల్లర్ ఎలిమెంట్స్‌, ట్విస్టులతో..

FIR Movie Review: ఎఫ్ఐఆర్ మూవీ రివ్యూ.. థ్రిల్లర్ ఎలిమెంట్స్‌, ట్విస్టులతో..
X
FIR Movie Review: విష్ణు విశాల్.. రెగ్యులర్‌గా తమిళ సినిమాలు చూసేవారికి ఈ హీరో సుపరిచితమే.

FIR Movie Review: మాస్ మహారాజ్ రవితేజ తనకు సంబంధించిన రెండు సినిమాలను ఫిబ్రవరి 11నే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఒకటి తాను నటించిన 'ఖిలాడి' అయితే మరొకటి తాను ప్రజెంట్ చేస్తున్న డబ్బింగ్ చిత్రం 'ఎఫ్‌ఐఆర్'. ఈ రెండు సినిమాలు వేర్వేరు జోనర్లని, రెండిటిలో ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయని రవితేజ ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఎఫ్‌ఐఆర్ సినిమా రివ్యూ ఎలా ఉందంటే..

విష్ణు విశాల్.. రెగ్యులర్‌గా తమిళ సినిమాలు చూసేవారికి ఈ హీరో సుపరిచితమే. ఇది తెలుగులో డబ్ అవుతున్న విష్ణు విశాల్ మొదటి చిత్రం. పూర్తిగా థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని మను ఆనంద్ తెరకెక్కించాడు. ఇందులో రెబ్బా మోనికా జాన్, మంజిమా మోహన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. గౌతమ్ నారాయణ్, రైజా విల్సన్ లాంటి వారు ఇందులో ఇతర పాత్రల్లో కనిపించారు. ఇక 'ఎఫ్‌ఐఆర్'కు ప్రాణంలాగా నిలిచిన పాత్ర చేశారు గౌతమ్ మీనన్.

'ఎఫ్ఐఆర్' కథ విషయానికి వస్తే.. ఇర్ఫాన్ ఆహ్మాద్ (విష్ణు విశాల్) ఐఐటీలో గోల్డ్ మెడలిస్ట్ అయినా కూడా ఓ చిన్న కెమికల్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ముస్లిం వర్గానికి సంబంధించిన కంపెనీకి ఇర్ఫాన్ పనిచేస్తున్న కంపెనీ కెమికల్స్ సప్లై చేస్తుంటుంది. అయితే అదే సమయంలో శ్రీలంక, హైదరాబాద్‌లో జరిగిన పేలుళ్లలో ఇర్ఫాన్ హస్తం ఉందంటూ పోలీసులు తనను అరెస్ట్ చేస్తారు. ఇంతకీ తనకు సంబంధం ఉందా లేదా అనేది తెరపై చూడాల్సిన కథ.

ఇది ఒక థ్రిల్లర్ కథే అయినా.. దేశభక్తి ఎలిమెంట్‌ను ఎఫ్‌ఐఆర్‌లో బాగా చూపించాడు మను ఆనంద్. ఫస్ట్ హాఫ్‌లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కాస్త తక్కువగానే ఉన్నా.. సెకండాఫ్‌లో కథ అంతా ఆసక్తికరంగా మారుతుంది. 'ఎఫ్ఐఆర్'లో కొన్ని రొటీన్ అంశాలు ఉన్నా కూడా సినిమాను మాత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా చూసుకున్నాడు దర్శకుడు. ఇక సినిమాను స్క్రీన్‌పై ముందుండి నడిపించిన క్రెడిట్ అంతా విష్ణు విశాల్‌కే దక్కుతుంది.

Tags

Next Story