heart of stone : అలియా నటించిన హాలీవుడ్ మూవీ ఎలా ఉందంటే
వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్. తాజాగా హార్ట్ ఆఫ్ స్టోన్ మూవీతో ఈ భామ హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. గాల్ గాడాట్‌తో ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తెర పంచుకుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన హార్ట్ ఆఫ్ స్టోన్’ ఇవాళ విడుదలైంది. ఇంతకీ ఇదీ అభిమానులను ఆకట్టుకుందా... హాలీవుడ్‌లో అలియా అడుగు బలంగా పడిందా... ఇంతకీ ఏ సినిమా ఎలా ఉందంటే...
హాలీవుడ్ దర్శకుడు టామ్ హార్పర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’. ఈ మూవీలో గ్యాల్ గ్యాడట్, జామీ డోర్నాన్, సోఫీ ఒకొనెడో, మాథియాస్, జింగ్ లూసి, పాల్ రెడీతో పాటు కూడా మూవీలో నటించింది.
మహిళా పాత్రలు హార్ట్ ఆఫ్ స్టోన్ కు ప్రధాన ఆకర్షణ గా ఉన్నాయి. రాచెల్ స్టోన్‌గా గాల్ గాడోట్ తన విశ్వ రూపాన్ని చూపించింది. యాక్షన్ సన్నివేశాలలో ఆమె ప్రత్యర్థిపై గెలుపు ఆమె పాపులర్ క్యారెక్టర్‌ని గుర్తు చేస్తుంది. నిజానికి రాచెల్ స్టోన్‌ను ఆమె తన సొంత పాత్రగా మార్చుకుంటుంది. గూఢచారి నెట్‌వర్క్‌కు మార్గనిర్దేశం చేసే కృత్రిమ మేధ, అలాగే ఆమె స్వంత ఆలోచనల మధ్య నలిగిపోయే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
అలియా భట్ కీయాధావన్ అనే 22 ఏళ్ల హ్యాకర్‌గా నటించింది. ఓ అమూల్యమైన ఆయుధాన్ని దొంగిలిస్తుంది అయితే ప్రారంభంలో, ఎంత క్యూట్ గా కనిపించిందో. ఆ తర్వాత ఆమె తుపాకీ గురిపెట్టిన సన్నివేశంలో అంతటి మెచ్యూరిటీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మొత్తానికి దేశానికి ఎదురైన ఒక ప్రమాదాన్ని తప్పించడానికి గాల్ గ్యాడోట్ టీమ్ ప్రయత్నిస్తుంటే. ఆ టీమ్ ప్రయత్నాలకు అడుగడుగునా సవాళ్లు విసిరే విలన్ పాత్రలో అలియా అల్లరించింది. యాక్షన్ సీన్స్ లోను ప్రేక్షకులను కట్టిపడేసింది.
‘చార్టర్‌కు పవర్ అందించేది హార్టే.. దీంతో నేలను, నింగిని దున్నేయొచ్చు.. హార్ట్ నీ సొంతమైతే ఈ ప్రపంచమే నీది’ అంటూ సాగే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇంతకీ చార్టర్ ఏంటి? దానికి హార్ట్‌తో ఉన్న సంబంధం ఏంటి? దాన్ని ఎవరు హైజాక్ చేశారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com