Game Changer Review : గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ
రివ్యూ : గేమ్ ఛేంజర్
తారాగణం : రామ్ చరణ్,అంజలి, కియారా అద్వానీ, శ్రీకాంత్, ఎస్.జే సూర్య, జయరాం, రాజీవ్ కనకాల తదితరులు
ఎడిటర్ : షమీర్ మహ్మద్, రూబెన్
సినిమాటోగ్రఫీ : తిరు
సంగీతం : థమన్ ఎస్
నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్
కథ : కార్తీక్ సుబ్బరాజు
దర్శకత్వం : శంకర్
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ గ్రాఫ్ మరింత పెంచుకునే ప్రయత్నంలో మరో ప్యాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ తో సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఫ్యాన్స్ అంతా ఖుషీ అయ్యారు. బట్ మూవీ బాగా లేట్ అయింది. మధ్యలో గేమ్ ఛేంజర్ ను ఆపేసి భారతీయుడు 2 చేయాల్సి వచ్చింది. ఆ మూవీ రిజల్ట్ చూసిన తర్వాత మెగా ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ట్రైలర్ తో అంచనాలు పెంచి సంక్రాంతి బరిలో ఈ శుక్రవారం విడుదలైన గేమ్ ఛేంజర్ ఎలా ఉందో చూద్దాం.
కథ :
రామ్ నందన్( రామ్ చరణ్) ఐపిఎస్ నుంచి తన ప్రేయసి దీపిక(కియారా) కోరిక మేరకు ఐఎస్ అవుతాడు. విశాఖపట్నంలో పోస్టింగ్.
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి(శ్రీకాంత్). ఆయన కొడుకుల్లో ఒకడైన మోపిదేవి(ఎస్.జే సూర్య) మంత్రి. తండ్రి నుంచి పదవి లాక్కుని ముఖ్యమంత్రి అయిపోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి కలెక్టర్ తో గొడవ అవుతుంది. అప్పటి నుంచి కలెక్టర్ పై పగ పెంచుకుంటాడు. ఓ సారి ముఖ్యమంత్రి విశాఖపట్నం సభకు వస్తే ఆ సభలో పార్వతి అనే వృద్ధ మహిళ ముఖ్యమంత్రిని అరేయ్ అని సంబోధిస్తూ నిలదీస్తుంది. ఆ వేదికపై మోపిదేవి ఆమెను నెట్టడంతో పాటు కలెక్టర్ పై చేయి చేసుకుంటాడు. కలెక్టర్ కూడా మంత్రిని కొడతాడు. అప్పటి నుంచి రామ్ పై పగ పెంచుకున్న మోపిదేవి అతన్ని అంతం చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో అనుకోకుండా రామ్ నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా, తన రాజకీయ వారసుడుగా ప్రకటించి కన్నుమూస్తాడు ముఖ్యమంత్రి సత్యమూర్తి. మరి అతను అలా ఎందుకు చేశాడు. పార్వతి అనే మహిళకు సత్యమూర్తికి, రామ్ కు ఉన్న సంబంధం ఏంటీ అనేది మిగతా కథ.
ఎలా ఉంది :
ఓ సాదారణ పొలిటికల్ స్టోరీని అంతే సాధారణంగా చెప్పే ప్రయత్నం చేశాడు శంకర్. పొలిటికల్ మూవీస్, సోషల్ ఎలిమెంట్స్ ఉన్న కథలు శంకర్ అద్భుతంగా డీల్ చేస్తాడు. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారతీయుడు 2 పోయినా పొలిటికల్ మూవీ కాబట్టి శంకర్ మార్క్ ఉంటుందని భావిస్తే.. మీరు గేమ్ నుంచి ఎగ్జిట్ అయినట్టే. అలా కాకుండా ఓ మామూలు సినిమా చూసేందుకు ప్రిపేర్ అయ్యి వెళితే మాత్రం కొంత వరకూ ఎంగేజ్ అవుతారు.
ఫస్ట్ హాఫ్ లో రామ్ నందన్ పాత్ర ఎంట్రీ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకూ ఆకట్టుకునేలా రాసుకున్నాడు. కలెక్టర్ పవర్స్ ను చూపించే విధానం, కలెక్టర్ తన అధికారాలను మంత్రికి చెప్పే సీన్స్ లో శంకర్ పనితనం కనిపిస్తుంది. అయితే అప్పన్న పాత్ర ఎంటర్ అయిన సెకండ్ హాఫ్ మాత్రం చాలా వరకూ తేలిపోయింది. అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటన బావున్నా.. ఆ పాత్రను తీర్చి దిద్దిన విధానం నుంచి ఎండ్ అయ్యే వరకూ అంతగా ఆకట్టుకోదు. అసలా పాత్రకు నత్తి పెట్టాలన్న ఆలోచనతోనే సెకండ్ హాఫ్ కు గండి పడింది. విలన్ ఒకే పంథాలో ఉండటం.. కలెక్టర్ వర్సెస్ మినిస్టర్ గా చివరి వరకూ సాగిన డ్రామా.. ఫ్లాష్ బ్యాక్ డ్రామా వీక్ గా ఉండటం సెకండ్ హాఫ్ ను దెబ్బ తీశాయి. అయినా రామ్ చరణ్ ఒన్ మేన్ షో లా నడిపించాడు.కియారాతో లవ్ ఎపిసోడ్ ఓకే అనిపిస్తుంది. ఆ ట్రాక్ లో రామ్ చరణ్ లుక్ బావుంది. అంజలికి మంచి పాత్ర పడింది. బాగా నటించింది. సూర్య నటన ఒక దశ వరకూ బానే అనిపించినా.. అదే పనిగా రిపీట్ కావడంతో విసుగు అనిపిస్తుంది. బట్ విలనీతో అప్పుడప్పుడూ ఫన్ జెనరేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. శ్రీకాంత్ గెటప్ ఉన్నంతగా నటన ఇంపాక్ట్ చూపించలేదు. సముద్రఖని సైడ్ క్యారెక్టర్. జయరాంతో చేయించిన కామెడీ వర్కవుట్ కాలేదు. సునిల్ పాత్ర అస్సలు నవ్వించకపోగా అసలెందుకు అలా చేశారా అనిపిస్తుంది.
టెక్నికల్ గా అన్ని విధాలా బావుంది. తమన్ నేపథ్య సంగీతం, తిరు సినిమాటోగ్రఫీ అన్నీ బావున్నాయి. తెలుగు డైలాగ్స్ అంత డెప్త్ గా అయితే లేవు. కాస్ట్యూమ్స్, సెట్స్, ఆర్ట్ వర్క్ చాలా లావిష్ గా కనిపిస్తాయి. ప్రొడక్షన వాల్యూస్ రిచెస్ట్ గా కనిపిస్తాయి. శంకర్ ఏం అడిగినా నో చెప్పుకుండా అన్నీ సమకూర్చాడు దిల్ రాజు. కానీ శంకరే.. దిల్ రాజుకు కావాల్సిన అవుట్ పుట్ ఇచ్చాడా అంటే అన్ ప్రిడిక్టబుల్ అని చెప్పాలి.
నిజానికి ఈ తరహా కథలు చాలానే చూశాం. పొలిటికల్ మూవీస్ లో ఉండాల్సినంత డ్రామా ఈ మూవీలో కనిపించదు. దర్శకుడుగా శంకర్ చాలా చోట్ల తేలిపోయాడు. అలాగని పూర్తిగా అవుట్ డేటెడ్ అని చెప్పలేం కానీ.. అప్డేట్ అయితే కాలేదు అని చెప్పొచ్చు.
అసలు రామ్ చరణ్ పెంపుడు పేరెంట్స్ వద్దకు ఎలా వెళ్లాడు.. అంజలి అన్నేళ్ల పాటు ఎక్కడ ఉంది..? ఆమెను చూడగానే షాక్ అయిన ముఖ్యమంత్రి.. అచ్చం అప్పన్నలా ఉన్న రామ్ నందన్ ను చూసి ఎందుకు షాక్ అవలేదు. అసలు ఎలెక్షన్ ఆఫీసర్ ఇలా చేయగలడా..? రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా పార్టీలు ఉంటాయా..?ఇలాంటి ఎన్నో ప్రశ్నలను ప్రేక్షకులకే వదిలేశాడు శంకర్. కానీ ఎంత ఆలోచించినా వాటికి సరైన రీజన్స్ మాత్రం ఎవరూ చెప్పలేరు. అది పూర్తిగా శంకర్ ఫెయిల్యూర్.
ఫైనల్ గా : రామ్ చరణ్ ఒన్ మేన్ షో.
రేటింగ్ : 2.5/5
- బాబురావు కామళ్ల
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com