Happy Birthday Movie Review: 'హ్యాపీ బర్త్ డే' మూవీ రివ్యూ.. లావణ్య కొత్త అవతారం..

Happy Birthday Movie Review: ఈమధ్య టాలీవుడ్‌లో ఎంతోమంది యంగ్ దర్శకులు కొత్త కథలతో, డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అందుకే స్టార్ దర్శకులు సైతం యంగ్ డైరెక్టర్లతో పనిచేయడానికి ఎదురుచూస్తున్నారు. అలా ప్రేక్షకులను యంగ్ డైరెక్టర్స్‌లో ఒకరు రితేష్ రానా. ఇప్పటికే తాను తెరకెక్కించిన 'మత్తు వదలరా'తో అందరినీ ఆశ్చర్యపరిచిన రితేష్ రానా.. మరోసారి 'హ్యాపీ బర్త్ డే'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
కథ..
రిత్విక్ సోది ( వెన్నెల కిషోర్) ఇండియాకు రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తుంటాడు. తన సొంత లాభాల కోసం పార్లమెంటులో గన్ లా ను ప్రవేశపెడతాడు రిత్విక్. అంటే దేశంలో ఎవరైనా గన్స్ ఉపయోగించవచ్చు, వారికి గన్స్ ఎక్కడైనా లభిస్తాయి అని ఈ లా ఉద్దేశ్యం. ఫైనల్‌గా ఈ లా వల్ల రిత్విక్‌కు ఎలాంటి ప్రయోజనం ఉంది. ఈ కథలో హ్యాపీ (లావణ్య త్రిపాఠి) పాత్ర ఏంటి అనేది తెరపై చూడాల్సిన కథ.
విశ్లేషణ..
'హ్యాపీ బర్త్ డే' సినిమాలో లావణ్య త్రిపాఠి మాత్రమే లీడ్ రోల్ కాదు.. సత్య, వెన్నెల కిషోర్ పాత్రలు కూడా మొదటినుండి చివరి వరకు లీడ్ రోల్‌తో ప్రయాణిస్తాయి. ముఖ్యంగా సత్య చేసిన కామెడీ రోల్ సినిమాకు కీలకంగా నిలిచింది. సత్య, లావణ్య కలిసి చేసే కామెడీ సీన్లు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. గన్ లా అనే కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు తెలుగులో సినిమా రాకపోవడంతో ఈ కథ ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది.
'హ్యాపీ బర్త్ డే'లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో విషయం ట్రెండ్. ఈ జెనరేషన్‌లో ట్రెండ్ అనే పదం ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్‌లో ఉన్న దాదాపు అన్ని విషయాలను రితేష్ రానా ఈ సినిమాలో ఉపయోగించాడు. దీంతో యూత్.. ఈ మూవీకి ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా 'హ్యాపీ బర్త్ డే' ఒక డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com