23 Sep 2021 4:15 PM GMT

Home
 / 
సినిమా / రివ్యూ / రివ్యూ : మరోప్రస్థానం

రివ్యూ : మరోప్రస్థానం

తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'మరో ప్రస్థానం'. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది.

రివ్యూ : మరోప్రస్థానం
X

తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'మరో ప్రస్థానం'. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ముస్కాన్ సేథీ నాయిక. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలానే ఉంది అనిపించింది. సినీ ప్రముఖులను సైతం ట్రైలర్ తో మెప్పించిన మరో ప్రస్థానం మూవీ ఈరోజు విడుదలైంది. మరి.. మరో ప్రస్థానం.. ఫలితం ఏంటి..? అనేది చెప్పాలంటే ముందుగా కథ చెప్పాల్సిందే.

కథ :

శివ (తనీష్) డబ్బు కోసం క్రిమినల్ గా మారతాడు. ముంబాయిలోని ఓ క్రిమినల్ గ్యాంగ్ లో ఒకడిగా ఉంటూ క్రైమ్ చేస్తుంటాడు. ఈ గ్యాంగ్ కి లీడర్ రాణెభాయ్ (కబీర్ దుహాన్ సింగ్). చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు, అమ్మాయిలను రేప్ చేయడం.. బాంబ్ బ్లాస్ట్ లు చేయడం.. ఇలా ఒకటేమిటి క్రైమ్ ఏదైనా సరే.. చేయడానికి రెడీ అంటూ ముందుంటుంది ఈ గ్యాంగ్. ఇలా నేర చరిత్ర ఉన్న శివ నైని (అర్చనా ఖన్నా)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. నైని కూడా శివను ప్రేమిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఆతర్వాత నుంచి నేరవృత్తిని వదిలేసి కొత్త జీవితం ప్రారంభించాలి అనుకుంటాడు. ఈ టైమ్ లో శివ గ్యాంగ్లో మనుషులు శివ భార్య నైనిని చంపేస్తారు. అంతే.. శివకు కోపం వస్తుంది. జీవితం మీదే విరక్తి వస్తుంది. చచ్చిపోవాలి అనుకుంటాడు.

అయితే.. చనిపోయే ముందు ఈ క్రైమ్ గ్యాంగ్ అసలు గుట్టు బయటపెట్టాలి అనుకుంటాడు. సీక్రెట్ గా ఆ గ్యాంగ్ చేసే ప్రతి పనిని కెమెరా షూట్ చేస్తుంటాడు. గన్ తో షూట్ చేసే శివ ఇప్పుడు సీక్రెట్ కెమెరాతో షూట్ చేస్తుంటాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. రాణేభాయ్ కి ఎవరో సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నారనే విషయం తెలుస్తుంది. ఇదిలా జరుగుతుంటే.. శివను ప్రేమిస్తున్నాను అంటూ యువిధ వెంటపడుతుంది. మరో వైపు ఈ గ్యాంగ్ రహస్యాలు బయటపెట్టాలనుకునే జర్నలిస్ట్ (భానుశ్రీ మెహ్రా) ను కిడ్నాప్ చేస్తారు. ఆమెను శివ తప్పించాలి అనుకుంటారు. ఆ జర్నలిస్ట్ ను తప్పించాడా..? సీక్రెట్ ఆపరేషన్ ఏమైంది..? అనేదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్

తనీష్‌ నటన

జాని డైరెక్షన్

ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్

రెగ్యులర్ స్టోరీ కాకపోవడం

విశ్లేషణ

తనీష్ శివ పాత్రలో పూర్తి న్యాయం చేశారు. ఎక్కడా నటిస్తున్నాడు అనిపించలేదు. ఆ పాత్ర స్వభావాన్ని పూర్తిగా అర్ధం చేసుకుని నటించాడు. అందుకనే ఆ పాత్ర అంత బాగా వచ్చింది అనిపిస్తుంది. ముస్కాన్ సేథీ, అర్చనా ఖన్నా అందం, అభినయంతో ఆకట్టుకున్నారు. ఇక వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా రిపోర్టర్ గా పాత్ర పరిథి మేరకు నటించింది. వీళ్ల తర్వాత చెప్పుకోవాల్సింది విలన్ పాత్ర పోషించిన కబీర్ దుహాన్ సింగ్ గురించి. కొత్త తరహా విలనిజం చూపించి మెప్పించాడు. టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు ఇతర పాత్రల్లో నటించారు.

ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. దర్శకుడు జాని రెగ్యులర్ మూవీలా కాకుండా కొత్త తరహా సినిమాను అందించాలని చేసిన ప్రయత్నాన్ని అభినందించాలి. సింగిల్ షాట్ మూవీ చేయడం అంటే మామూలు విషయం కాదు. దీనికి టీమ్ అందరి సహకారం చాలా అవసరం. ఎవరు కరెక్ట్ గా చేయకపోయినా మళ్లీ చేయాల్సి వస్తుంది. దీనికి ప్రిపరేషన్ చాలా అవసరం. టీమ్ అంతా బాగా హోమ్ వర్క్ చేశారు కాబట్టే ఈ సినిమా బాగా వచ్చింది అనిపిస్తుంది. టీమ్ కష్టం తెర పై కనిపిస్తుంది. ఈ సినిమాకి యాక్షన్ సీన్స్ తో పాటు సునీల్ కశ్యప్ సంగీతం కూడా హైలైట్ అని చెప్పచ్చు. ఆలోచింపచేసేలా వసంత కిరణ్ రాసిన సంభాషణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఎంఎన్ బాల్ రెడ్డి కెమెరావర్క్ పనితనం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.

కొత్త తరహా చిత్రాలు చూడాలనుకునే వారికి మరో ప్రస్థానం మంచి ఆప్షన్.

Next Story