Insidious: The Red Door Movie ఇన్సిడియస్: ది రెడ్ డోర్ ఎలా ఉందంటే
హాలీవుడ్ హారర్ మూవీ ఇన్సిడియస్ సీరీస్ లో 5వ భాగంగా వచ్చింది ఇన్సిడియస్: ది రెడ్ డోర్. పాట్రిక్ విల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సోనీ పిక్చర్స్ ద్వారా ఈరోజు జులై 6న ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల అయ్యింది. ఇన్సిడియస్(2010), ఇన్సిడియస్ చాప్టర్ 2(2013)కి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇన్సిడియస్ చాప్టర్ 2 ముగింపు తర్వాత అంటే ఆ సంఘటనలు జరిగిన పదేళ్ల తర్వాత ఈ చిత్రం కథ ప్రారంభం అయ్యింది.
జోష్ లాంబెర్ట్ తన కొడుకు డాల్టన్‌ను ఒక ఇడిలిక్, ఐవీ-లీగ్ యూనివర్శిటీలో దింపడానికి వెళ్తాడు. ఆ యూనివర్శీటీ డాల్టన్‌కు ఓ పీడకలలా మారుతుంది. అతని చేత గతంలో అణచివేతకు గురైనవారు అకస్మాత్తుగా వారిద్దరినీ వెంటాడేందుకు తిరిగి వస్తారు. వారిని అంతం చేయడానికి, లాంబెర్ట్ పీడకలని ఆపడానికి జోష్, డాల్టన్ మరోసారి ఏమిచేశారు అనేదే ఈ మూవీ కథ. ఈ చిత్రంలో డాల్టన్ లాంబెర్ట్ గా టై సింప్కిన్స్, జోష్ లాంబెర్ట్ గా పాట్రిక్ విల్సన్, ఫోస్టర్ లాంబెర్ట్ గా ఆండ్రూ ఆస్టర్ నటించారు. అయితే ఈ చిత్రం పెద్దగా ప్రచారం లేకపోవడం వల్ల ఓపెనింగ్స్ పెద్దగా వసూలు చేసుకోలేకపోయింది. అయితే కధ తెలిసినవాళ్లు మాత్రం సినిమా విషయం లో పెద్దగా నిరుత్సాహ పడరు. అలా అని సినిమా పాత విషయాలు, కొత్త సమస్యలకు అన్నింటికీ కూడా సరైన జవాబులు ఇచ్చింది అని కూడా చెప్పలేకుండా కధ మధ్యలో పూర్తి అయిన భావన కలుగుతుంది.
అయితేనేం జోసెఫ్ బిషారా నేపథ్య సంగీతం, ఆటం ఈకిన్ సినిమాటోగ్రఫీ సినిమాను ముందు వరుసలో నిలబెట్టడానికి కృషి చేశాయని చెప్పొచ్చు. ఆడమ్ రీమర్ ప్రొడక్షన్ డిజైనింగ్ మరియు అబ్రహం చాన్ ఆర్ట్ డైరెక్షన్ కూడా కధకు తగినట్టుగా ఉన్నాయి. మొత్తానికి అద్భుతంగా ఆరంభమైన ఈ సినిమా చివరికి వచ్చేటప్పటికి చాలా సాధారణంగా ముగుస్తుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com