NTR Devara : దేవర కథ ఇదేనా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన దేవర మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాపై తెలుగులో భారీ అంచనాలున్నాయి. ఇతర భాషల్లో ఎక్స్ పెక్ట్ చేసినంతగా అడ్వాన్స బుకింగ్స్ జరగడం లేదు. ముఖ్యంగా తమిళనాడులో థియేటర్స్ కూడా దొరికే పరిస్థితి లేదంటున్నారు. అక్కడ దేవర కంటే ఎక్కువగా కార్తీ మేయాళగన్ కు డిమాండ్ ఉంది. థియేటర్ ఓనర్స్ కూడా ఆ సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సరే సినిమా టాక్ వస్తే దాన్ని బట్టి అన్నీ మారతాయి. అయితే ఈ సినిమా కథకు సంబంధించి కీలకమైన అంశాలు కనిపిస్తున్నాయి. వాటిని బట్టి చూస్తే దేవర కథ ఇదే అంటున్నారు.
సముద్ర తీర ప్రాంతంలో ఉండే ఒక తెగ సముద్రంలో నుంచి రేవులక వస్తోన్న ఓడలు, నావలపై దాడులు చేస్తూ అడ్డొచ్చిన వారందరినీ చంపేస్తుంటారు. అసలు భయమంటే ఏంటో తెలియని తెగ అది. అలాంటి వారి మధ్యలోనే ఉండే దేవర కూడా మొదట అందరితో పాటు దోపిడీలు చేస్తాడు. కానీ ఓ దశలో రియలైజ్ అయిన దేవర మనిషిలో ఇంత ధైర్యం ఉంటే ప్రమాదం అని గ్రహించి తన తెగను ప్రక్షాళన చేయాలని చూస్తాడు. ఇది నచ్చని భైరా.. దేవరపై తిరుగుబాటు చేయకుండా స్నేహం నటిస్తూనే అతన్ని అంతమొందించాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. మరోవైపు ఈ పనిపై వెళ్లిన దేవర ఫ్యామిలీ మరో చోట ఉంటుంది. అతని కొడుకు వర.. అతను భయస్తుడు. దేవర ధైర్యం ఇసుమంత కూడా కనిపించకుండా ఉంటాడు. అలాంటి వాడిని ప్రేమిస్తుంది తంగం(జాన్వీ) అనే అమ్మాయి.
ఇలా ఉండగా భైరాకు టైమ్ వస్తుంది. దేవరను అంతం చేస్తాడు.. ఇది ఇంటర్వెల్ బ్యాంగ్. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సీక్వెన్సే ట్రైలర్ లో కనిపించిన నెలవంక షాట్ ఉన్నదేనట. భీకరమైన ఈ ఫైట్ లోనే దేవర చనిపోయాడని తెలుస్తుంది. అయితే దేవరపై స్నేహం ఉన్నట్టుగా నటిస్తూ.. అతని కొడుకును మళ్లీ సముద్రంలోకి తీసుకు వస్తాడు భైరా. భయపడుతూనే వెళ్లిన వరకు కొన్నాళ్ల తర్వాత తన తండ్రిని వీళ్లే చంపారని తెలుస్తుంది. అప్పుడు అతను తిరుబాటు చేస్తాడు. ఈ క్రమంలో వరను కూడా చంపాలని ప్రయత్నిస్తాడు భైరా. ఈ క్రమంలోనే ఓ భారీ స్కెచ్ వేసి వరను సముద్రంలోనే అంతం చేయాలని ప్రయత్నిస్తోన్న క్రమంలో చనిపోయాడనుకున్న దేవర బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది. అతనే తన కొడుకు వరను కాపాడుకుంటాడ. ట్రైలర్ లో సముద్రంలో నిప్పుల కొలిమిలో కనిపిస్తోన్న ఆ ఆకారం చనిపోయాడనుకున్న దేవరదేనట. అయితే తన కొడుకును కాపాడుకునే క్రమంలో దేవర భైరాను చంపేసి క్లైమాక్స్ కు ముందు తన బాధ్యత తనయుడు వర చేతిలో పెట్టడం.. ఆపై ఎవరూ ఊహించని విధంగా భైరా కోసం మరో వ్యక్తి ( బాబీ డియోల్) ఎంటర్ కావడం.. అప్పుడు వర వర్సెస్ ఆ పర్సన్ గా సెకండ్ పార్ట్ కు లీడ్ ఇస్తూ.. ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అవడం జరుగుతుందట.సో.. ఈ చివరి 20 నిమిషాల్లో పదినిమిషాలు సముద్రంలో భీకరమైన ఫైట్ తో పాటు దేవర చనిపోతూ కనిపించే ఎమోషన్ ఆడియన్స్ ను కట్టి పడేస్తాయంటున్నారు. సో.. మరి ఈ మూవీ కథ నిజంగా ఇదేనా కాదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుందన్నమాట.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com