Kalapuram Review: కళాపురం మూవీ రివ్యూ.. అందరినీ నవ్వించే విలేజ్ డ్రామా..

Kalapuram Review: పలాస1978, శ్రీదేవి సోడా సెంటర్ వంటి చిత్రాలతో నెలమీద కథలను వెండితెరమీద ప్రజెంట్ చేయడంలో ప్రతిభావంతుడిగా పేరుతెచ్చుకున్న దర్శకుడు కరుణ కుమార్. కమెడియన్ ముద్రను క్షణం, పొలిమేర తో బ్రేక్ చేసిన సత్యం రాజేష్ నటుడిగా కొత్త ప్రయాణం మొదలు పెట్టాడు. వీరి కాంబినేషన్ లో వచ్చిన కళాపురం ఎలాంటి ఎక్స్ పీరియన్స్ లను అందించిందో తెలుసుకుందాం..
కథః
కుమార్ ( సత్యం రాజేష్) ఇండస్ట్రీలో స్ట్రగులింగ్ డైరెక్టర్ అతని జీవితం కృష్ణానగర్ కష్టాలలో ఒకటి. వరుస ప్రయత్నాలతో విసుగెత్తిన అతని జీవితంలో మరో స్ట్రగులింగ్ ప్రొడ్యూసర్ అప్పారావు( జనార్దన్) నుండి దర్శకుడిగా అవకాశం వస్తుంది. కానీ ఒక కండీషన్ పెడతాడు అప్పారావు. తమ ఊరు (కళాపురం) లో సినిమా తీయాలనేది ఆ కండీషన్ . సినిమా తీసేందుకు అడ్వాన్స్ లందుకున్న కుమార్ తన ప్రెండ్
( ప్రవీణ్) కళాపురంలో అడుగు పెడతాడు. అక్కడికి వెళ్లిన కుమార్ ఒక పోలీస్ కేస్ లో ఇరుక్కుంటాడు. సినిమా తీయమని చెప్పి పంపించిన అప్పారావు మరో పోలీస్ కేస్ లో పట్టుపడతాడు. అదే ఊరిలో కొందరి సహాయంతో కుమార్ సినిమా తీస్తాడు. మరి ఆ సినిమా రిలీజ్ అయ్యిందా..? అప్పారావు ఎందుకు హ్యాండ్ ఇచ్చాడు. ..? కుమార్ దర్శకుడు అవ్వాలనే కల నెరవేరిందా అనేది మిగిలిన కథ..?
కథనంః
కరుణ కమార్ తీసుకున్న కథ, కథనం చాలా రియలిస్టిక్ గా సాగింది. ఇప్పటి వరకూ చూసిన సత్యం రాజేష్ వేరు ఈ సినిమాలో చాలా కొత్త గా కనిపించాడు. అతని డైలాగ్ డెలివరీలో కూడా కంగారు లేదు. చాలా సహాజంగా అతని నటన ఉంది. సినిమా ఇండస్ట్రీలో వినోదం తెరమీదకంటే తెర వెనక చాలా ఉంటుందనే విషయం ఈ సినిమాతో మరో సారి ప్రూవ్ అయ్యింది. ఒక డైరెక్టర్ సినిమా కథ చెప్పేటప్పుడు నిర్మాతల తాలుకు కొన్ని జోడింపులు ఎలా ఉంటాయో ఒక సన్నివేశం చెబుతుంది.
హీరోయిన్ గా ఎదగాలని అనుకునేటప్పుడు రిలేషన్స్ ని ఇన్వెస్ట్ మెంట్ గా ఎలా వాడతారో సత్యం రాజేష్ గాళ్ ఫ్రెండ్ గా చేసిన కాష్మి క్యారెక్టర్ తో చెప్పాడు. సినిమా ఇండస్ట్రీ పై ఉన్న బ్రమలు చాలా తొలింగించాడు దర్శకుడు కరుణ కమార్. ఇక్కడ కనిపించే నవ్వులు చాలా వరకూ ఏడవలేక నవ్వేవే అని
గుర్తు చేసాడు. పలాస తో పరిచయం అయిన జనార్దన్ ఇందులో స్ట్రగులింగ్ ప్రొడ్యూసర్ గా చాలా బాగా నటించారు. అతని కాంబినేషన్ లో సన్నివేశాలు చాలా సరదాగాసాగాయి. ఇక ప్రొడ్యూసర్ ఇచ్చిన అడ్వాన్స్ తో కళాపురంచేరిన కుమార్ అక్కడ తగిలిన ట్విస్ట్ లు చాలా బాగున్నాయి. ఎలాగయినా సినిమా చేయాలనే పట్టుదలకు పుట్టిన కొన్ని క్యారెక్టర్స్ చాలా నవ్వించాయి. బాలామణి, ప్రేమ సాగర్ ల ప్రాత్రలు బాగున్నాయి. రచన, నటన, దర్శకత్వం అనేది ఒక తపస్సు లాంటింది. తమలోని కళను కరెక్ట్ గా అంచనా వేయలేని పాత్రలతో చాలా కామెడీ ని నడింపించారు దర్శకుడు కరుణ కుమార్. ప్రతి పాత్రను
చాలా హుందాగా డిజైన్ చేసాడు. హీరో చేసిన నాగేశ్వరి సినిమా మేకింగ్ బ్యాక్ డ్రాప్ వచ్చిన ( ఎమిటో వీడేమిటో) పాట బాగుంది. కళాపురం తో ప్రేక్షకుల ప్రయాణం సరదాగా సాగుతుంది. సిట్యువేషనల్ గా వచ్చే కామెడీ చాలా బాగుంది. పాము సీన్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. సత్యం రాజేష్ ప్రెండ్ గా చేసిన ప్రవీణ్ నటన బాగుంది. కళాపురం లో ట్విస్ట్ లు పై ఇంకా బాగా వర్క్ అవుట్ చేసుంటే బాగుండేది అనిపించింది. మణిశర్మ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. కెపీ సినిమాటోగ్రఫీ కొత్త లుక్ నిసినిమాకి అందించింది. రియలిస్టిక్ లోకేషన్స్ లో రియలిస్టిక్ పాత్రలతో సాగే ఎంటర్ టైనర్ కళాపురం.
శారదా పాత్రలో సంచిత నటన చాలా బాగుంది. ఆమె ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. సినిమా తీయడం ఎలాగో దర్శకుడు రియలైజ్ అయ్యే సన్నివేశం చాలా బాగా వర్క్ అవుట్ అయ్యింది. సినిమా బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి .కానీ కళాపురం మాత్రం ప్రత్యేకంగా అనిపించింది. ఎందుకంటే ఇది చాలా సహాజంగా ఉండే పాత్రలతో సంభాషనలతో హాయిగా ఉండే హాస్యంతో రూపొందిచిన చిత్రం . ఎలాంటి కథలు నయిగా డీల్ చేయగల ప్రతిభ ఉందని దర్శకుడిపై భరోసా కలిగించే చిత్రం కళాపురం.
చివరిగాః
కళాపురం కళాకారులందరూ హాయిగా నవ్విస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com