Santhosh : కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ రివ్యూ

Santhosh :  కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ రివ్యూ
X

రివ్యూ : ఆర్టిస్ట్

తారాగణం : సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్, సత్యం రాజేష్, ప్రభాకర్, వినయ్ వర్మ, తనికెళ్ల భరణి, సోనియా తదితరులు

ఎడిటర్ : ఆర్ఎమ్ విశ్వనాధ్ కుంచనపల్లి

సంగీతం : సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్రఫీ : చందు ఏజే

నిర్మాత : జేమ్స్ వాట్ కొమ్ము

దర్శకత్వం : రతన్ రిషి

కొత్త కథలు, కథనాలు ప్రతి వారం ప్రేక్షకులముందుకు వస్తూనే ఉంటాయి. ఈ సారి మర్డర్స్ లో ఆర్టిస్టిక్ వాల్యూస్ ని చూపించేందుకు వచ్చిన సినిమా ‘కిల్లర్ ఆర్టిస్ట్’.సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా తెరకెక్కిన సినిమా ‘కిల్లర్ ఆర్టిస్ట్’. ఎస్ జేకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మాణంలో రతన్ రిషి దర్శకత్వంలో తెరకెక్కిన కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా నేడు మార్చ్ 21న థియేట్రికల్ రిలీజ్ అయింది. మరి ఆర్టిస్ట్ గా మరిన కిల్లర్ కథేంటో చూద్దాం..

కథేంటి:

సిటీ లో ఒక సైకో కిల్లర్ పిచ్చి రవి( కాలకేయ ప్రభాకర్) అమ్మాయిలను హీరోయిన్స్ మాస్క్ లు పెట్టి రేప్ చేసి చంపుతుంటాడు. ఆ టైంలోనే విక్కీ(సంతోష్) చెల్లి స్వాతి(స్నేహ మాధురి) రేప్ కి గురయ్యి చనిపోతుంది. దీంతో విక్కీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. విక్కీ లవర్ జాను(క్రిషేక పటేల్) తనని మార్చాలని ట్రై చేస్తూ ఉంటుంది. డిప్రెషన్ నుండి రివైంజ్ లోకి దిగిన రవి పిచ్చి రవిని చంపుతాడా..? అసలు తన చెల్లిని చంపిందెవరు..? అనేది మిగిలిన కథ..?

కథనం:

కథగా చెప్పుకుంటే ఇది పూర్తి రివైంజ్ డ్రామా. అయిన దర్శకుడు ప్రజెంట్ చేసిన తీరు కొత్తగా ఉంది. సినిమా మొదలైన పదినిముషాలలో హత్యలతో ఒక మూడ్ ని సెట్ చేసాడు దర్శకుడు రతన్ రిషి. తర్వాత నెగిటివ్ గా పరిచయం అయిన విక్కీ ని పాజిటివ్ గా కథనంలో కి తెచ్చాడు. పిచ్చి రవి గా కాలకేయ ప్రభాకర్ సినిమాకి అసెట్ గా మారాడు. అతని పర్సనాలిటీ , వాయిస్ కిల్లర్ సినిమాకు జస్టిఫికేషన్ తెచ్చాయి. కమెడియన్ భద్రం కూడా తన రెగ్యులర్ రోల్స్ కి భిన్నమైన సీరియస్ రోల్స్ లో మెప్పించాడు. హీరో విక్కీ తన చెల్లికి మధ్య జరిగే సన్నివేశాలు చాలా హృద్యంగా సాగాయి. ఒకరికొకరు ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు. అయితే పిచ్చిరవికి విక్కీ కి మద్య జరగాల్సిన పోరాటం చూసేందుకు క్లైమాక్స్ వరకూ వేచి చూడాల్సి వచ్చింది.

అతన్ని పట్టుకునేందుకు హీరో చేసిన ప్రయత్నాలు మరింత గ్రిప్పింగా రాసుకుంటే బాగుండేది. హీరో చెల్లి చనిపోయిందనే పెయిన్ నుండి బయట పడేందుకు దర్శకుడు ఎక్కు వ టైం తీసుకున్నాడు. దీంతో రివైంజ్ కోసం వెయిట్ చేసే ఆడియన్స్ కి పెయిన్ గా అనిపించింది. సంతోష్ తన పాత్రకు న్యాయం చేసాడు.

సురేష్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సెకండాఫ్ లో పిచ్చిరవి హీరోయిన్ ఇంట్లో చేసే మర్డర్స్ షాకింగ్ గా ఉంటాయి. అక్కడ నన్ను ఆర్టిస్ట్ గా గుర్తించమని కాలకేయ ప్రభాకర్ చెప్పే డైలాగ్స్ లో అతనిలోని సైకోయిజం ని పీక్స్ లో కి తీసుకెళ్తాయి. నటుడిగా ప్రభాకర్ తన కెరియర్ లో కొత్త పాత్రను ప్రయత్నించాడు.

ఆ ఇంట్లో కథను నడిపే ప్రయత్నంలో హీరో అతన్ని చేరుకునేందుకు చేసే ప్రయత్నాలు మరింత ఇంట్రెస్టింగ్ మలుచుకుంటే బాగుండేది. ఈ ఆర్టిస్ట్ కథలో కామన్ ఎమోషన్ చెల్లి మీద ప్రేమ అయితే ఇందులో మరో కోణం ఉంటుంది. చెల్లి పాత్ర ని పోషించిన స్నేహ మాధురి నటన ఆకట్టుకుంది. సత్యం రాజేష్ తన పాత్రకు న్యాయం చేసాడు.

చివరిగా:

‘కిల్లర్ ఆర్టిస్ట్’ ఒక రివైంజ్ డ్రామా. సిస్టర్ సెంటిమెంట్ ఇందులో ఎమోషనల్ పాయింట్. అయితే హీరోకి సైకో కి కూడా అదేకామన్ పాయంట్. మర్డర్ మిస్టరీలను ఎంజాయ్ చేసే ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది.

రేటింగ్ : 2.5 / 5

Tags

Next Story