11 Aug 2022 1:42 AM GMT

Home
 / 
సినిమా / రివ్యూ / Laal Singh Chaddha...

Laal Singh Chaddha Review: 'లాల్ సింగ్ చడ్డా' రివ్యూ.. ఒక పర్ఫెక్ట్ రీమేక్..

Laal Singh Chaddha Review: అమీర్ ఖాన్, కరీనా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో.. నాగచైతన్య ఓ కీ రోల్ చేశాడు.

Laal Singh Chaddha Review: లాల్ సింగ్ చడ్డా రివ్యూ.. ఒక పర్ఫెక్ట్ రీమేక్..
X

Laal Singh Chaddha Review: హాలీవుడ్‌లో ఎంతోమంది మనసులు దోచుకున్న సినిమా 'ఫారెస్ట్ గంప్'. ఇక ఇప్పటికీ ఐఎమ్‌డీబీ రేటింగ్‌లో బెస్ట్ చిత్రాల్లో ఇది కూడా ఒకటి. అయితే అలాంటి సినిమా అమీర్ ఖాన్ రీమేక్ చేస్తున్నాడు అనగానే చాలామందికి ఈ రీమేక్‌పై అనుమానాలు మొదలయ్యాయి. కానీ ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్‌లో తమ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. అందులో చాలావరకు పాజిటివ్‌గా ఉండడం విశేషం.


అమీర్ ఖాన్, కరీనా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో.. నాగచైతన్య ఓ కీ రోల్ చేశాడు. ఇది చైతూ బాలీవుడ్ ఎంట్రీ. ఇక అమీర్ ఖాన్ లాంటి స్టార్ సినిమాతో చైతూ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంతో.. తనకు అక్కడ కూడా కెరీర్ మొదలయ్యిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక బాలరాజు పాత్రలో నాగచైతన్య లుక్ తన తాత అక్కినేని నాగేశ్వర రావును గుర్తుచేస్తోంది.


లాల్ సింగ్ చడ్డా సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి మూవీపై ఎన్నో విధాలుగా నెగిటివిటీ వినిపిస్తోంది. అంతే కాకుండా ఇప్పటికీ ట్విటర్‌లో బాయ్‌కాట్ బాలీవుడ్, బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా అనే హ్యాష్‌ట్యాగ్స్ కనిపిస్తూనే ఉన్నాయి. కానీ అమీర్ ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు ఇస్తూ వస్తున్నారు. దీనికి ఓ పర్ఫెక్ట్ రీమేక్ అని ట్యాగ్‌లైన్ ఇచ్చేస్తున్నారు.


Next Story