Laggam Time Movie Review : లగ్గం టైమ్ మూవీ రివ్యూ

Laggam Time Movie Review :  లగ్గం టైమ్ మూవీ రివ్యూ
X

రివ్యూ : లగ్గం టైమ్

ఆర్టిస్ట్స్ : రాజేష్ మేరు, నవ్య చిట్యాల, నెల్లూర్ సుదర్శన్, ప్రీతి సుందర్, ప్రణీత్ రెడ్డి, కేదార్ శంకర్ తదితరులు

ఎడిటర్ : ఆర్.ఎమ్. విశ్వనాధ్ కూచనపల్లి

సంగీతం : పవన్

సినిమాటోగ్రఫీ : పవన్ గుంటుకు

నిర్మాత : కే. హిమ బిందు

దర్శకుడు : ప్రజోత్ కే వెన్నం

కొత్తవాళ్లతో సినిమా అంటే కొత్తదనం ఉంటుందనే నమ్మకం కూడా ప్రేక్షకుల్లో ఉంటుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే సత్తా ఉన్న కథకు ఆడియన్స్ పట్టం కడతారు. అలాంటి మూవీనే లగ్గం టైమ్. టైటిల్ నుంచి ప్రమోషన్స్ వరకు బాగా ఆకట్టుకుందీ మూవీ. మరి ఆడియన్స్ ను మెప్పించిందా లేదా అనేది చూద్దాం.

కథ :

చందు(సుదర్శన్) అనన్య( నవ్య)లకు ఇద్దరూ పెళ్లి సెట్ అవుతుంది. అదే రోజు అనన్య బాయ్ ఫ్రెండ్ సూర్య మరో ఫ్రెండ్ తో కలిసి ఆమెను కిడ్నాప్ చేయాలనుకుంటారు. కానీ ఆ పెళ్లి టైమ్ లో జరిగిన కారణాల వల్ల అతను భయపడి పారిపోతారు. భయపడ్డం కూడా మామూలుగా ఉండదు. దీంతో అదే రోజు ఇంటర్వ్యూ ఉండటంతో అక్కడికి వెళ్లాలనుకుంటారు. ఆ ఇంటర్వ్యూకి వెళ్లిన హె.ఆర్ (ప్రీతి సుందర్)తో మాట కలుపుతాడు. పూణెలో తనకు అనన్యతో ప్రేమ సాగుతుందని హెచ్.ఆర్ కి చెబుతుంటాడు. ఇటు చూస్తే పెళ్లి కొడుకు అయిన చందు కిడ్నాప్ అయిపోతాడు. కట్ చేస్తే ఆ కిడ్నాప్ చేసింది సూర్యనే అని పోలీస్ లు ఎంటర్ అవుతారు. దీంతో అసలు పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసింది ఎవరు..? సూర్య, అనన్యల ప్రేమకథ ఎలా మొదలైంది.. అసలు పెళ్లి విషయంలో ఏం జరిగింది..? చివరికి సూర్య, అనన్య కలుస్తారా అనేది మిగతా కథ.

ఎలా ఉంది :

పెళ్లి అనగానే దాని చుట్టూ అల్లుకున్న కథలు ఆకట్టుకుంటాయి. ఈ కథ విషయంలో ఏకంగా పెళ్లి కొడుకు కిడ్నాప్ కావడం క్లవర్ గా ఉంటుంది. ఈ తరహా కొత్తదనంతో ఆకట్టుకుంటుందీ మూవీ. కాకపోతే ఈ తరహా కథల్లో రొటీన్ గా సాగడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. పెళ్లికి వెళ్లిన సూర్య.. తన లవర్ అనన్య కోసం ప్రయత్నాలు చేయడం.. పెళ్లి కొడుకు చందు కిడ్నాప్ కావడం.. సూర్యనే ఈ కిడ్నాప్ చేశాడు అని పోలీస్ లు చెప్పడం వరకు ఫస్ట్ హాఫ్ లో కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ ముగ్గరు మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తిగానే ఉంటాయి.

సెకండ్ హాఫ్ లో మాత్రం వరుసగా ట్విస్ట్ లు కనిపిస్తుంటాయి. ఎవరు ఎవరి మధ్య ఏం జరుగుతుంది అనే పాయింట్ చుట్టూ సాగే ట్విస్ట్ లు బావున్నాయి. అలాగే హీరో హీరోయినల మధ్య ఫ్లాష్ బ్యాక్ లో సాగే లవ్ స్టోరీ చాలా బావుంది. కాకపోతే పెళ్లింట్లో సాగే కథనం మాత్రం కాస్త సాగదీతగా కనిపిస్తుంది. అలాగే హీరోయిన్ ఫ్రెండ్ తో సాగే సీన్స్ కూడా ఆకట్టుకోలేవు. కామెడీ పరంగా అక్కడక్కడా ఫన్ జెనరేట్ అయింది.

సెకండ్ హాఫ్ లో కూడా కామెడీతో పాటు చిన్న చిన్న ట్విస్టులతో బాగానే నడిపించారు కానీ కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అవ్వలేదు. లవ్ ఫెయిల్యూర్ ఎమోషనల్ సీన్స్ రొటీన్ గానే అనిపిస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నా సింపుల్ గా తేల్చేసారు అనిపిస్తుంది. హీరో లవ్ స్టోరీతో పాటు, పెళ్లి కొడుకు లవ్ స్టోరీ ట్రాక్ కూడా నడిపించి ఆ రెండింటితో సెకండ్ హాఫ్ కాస్త ఆసక్తికర కథనంతో నడిపించారు. సరదాగా కాసేపు నవ్వుకోడానికి వెళ్ళాలి అనుకుంటే లగ్గం టైం చూడొచ్చు.

ఆర్టిస్టుల పరంగా చూస్తే హీరోగా రాజేష్ మేరు బాగా నటించాడు. తెలుగమ్మాయి అయిన అనన్య బాగా నటించింది. సుదర్శన్ కామెడీ హైలెట్ గా సాగుతుంది. ఇతర పాత్రధారులంతా బాగా మెప్పించారు.

టెక్నికల్ గా చూస్తే సినిమాటోగ్రఫీ చాలా బావుంది. సంగీతం బావుంది. పాటలు మాత్రం కాస్త యావరేజ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడుగా చూస్తే పాత కథే అయినా మాగ్జిమం కొత్తగా ఉండేలా రాసుకున్నాడు. అక్కడక్కడా రొటీన్ గా అనిపించినా బానే వర్కవుట్ చేశాడు.

ఫైనల్ గా : లగ్గం టైమ్ విత్ ఎంటర్టైన్మెంట్

రేటింగ్ : 2.5/5

Tags

Next Story