Mana Shankaravaraprasad garu review : మన శంకరవరప్రసాద్ గారు మూవీ రివ్యూ

రివ్యూ : మన శంకరవరప్రసాద్ గారు
ఆర్టిస్ట్స్ : చిరంజీవి, నయనతార, వెంకటేష్, సచిన్ ఖేద్కర్, కేథరీన్, హర్ష వర్ధన్, శరత్ సక్సేనా తదితరులు
ఎడిటింగ్ : తమ్మిరాజు
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి
నిర్మాతలు : సాహు గారపాటి, సుస్మిత కొణిదెల
దర్శకత్వం : అనిల్ రావిపూడి
సంక్రాంతి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. అతని మూవీస్ వరుసగా సంక్రాంతికి విడుదలవుతుండటం.. విజయం సాధించడం పరిపాటిగా మారింది. ఈ సారి మెగాస్టార్ చిరంజీవి హీరోగా మన శంకర వరప్రసాద్ గారు మూవీతో వచ్చాడు. నయనతార హీరోయిన్. రిలీజ్ కు ముందు భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ అంచనాలను అందుకునేలా మూవీ ఉందా లేదా అనేది చూద్దాం.
కథ :
శంకర వరప్రసాద్(చిరంజీవి)ఎన్.ఎస్.జి చీఫ్. అతనికి ఓ సెంట్రల్ మినిస్టర్ కు సెక్యూరిటీ ఇస్తుంటాడు. అయితే పెళ్లి తర్వాత విడాకులు తీసుకుని ఉంటాడు ప్రసాద్. అతనితో పాటు శశిరేఖ(నయనతార) అతని మాజీ భార్య. అయితే అతనికి ఇద్దరు పిల్లలు ఉంటారు. తండ్రిపై లేని పోని నెగెటివ్ ఇష్యూస్ చెబుతంటాడు అతని మామగారు అయిన జీవిఆర్(సచిన్ ఖేద్కర్). ఆ పిల్లలు బోర్డింగ్ స్కూల్ లో చదువుతుంటారు. ఆ పిల్లలను కలుపుకుని మళ్లీ మాజీ భార్యను కలవాలనుకుంటాడు. అదే ప్రయత్నం చేస్తారు కూడా. అదే టైమ్ లో జీవిఆర్ పై ఒక భారీ అటాక్ కు జరుగుతుంది. అందుకు కారణం ఏంటీ ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నాల్లో ది బెస్ట్ ఎన్.ఎస్.జి కమాండర్ అయిన ప్రసాద్ ఎంటర్ అవుతాడు. మరి అతనిపై ఎటాక్ ఎవరు చేశారు..? శశిరేఖతో మళ్లీ ప్రసాద్ తో కలుస్తాడా.. మధ్యలో వెంకటేష్ ఎంట్రీ ఎందుకు అనేది మిగతా కథ.
ఎలా ఉంది :
మన శంకర వరప్రసాద్ గారు.. ఇది పూర్తిగా మెగాస్టార్ చిరంజీవి మూవీ. ప్రతి ఫ్రేమ్ లో ఆయనే కనిపిస్తాడు. ప్రతి డైలాగ్ తో సంబంధం ఉంటుంది. సీన్స్, యాక్షన్, సాంగ్స్, డ్యాన్సులు ఇలా ప్రతి అంశంలోనూ స్పష్టంగా అతని డామినేషన్ కనిపిస్తుంది. అందుకే ఇది మెగా మూవీగానే ఫిక్స్ అయింది. ఈ తరహాలో చిరంజీవి ఈ మధ్య కాలంలో కథలు చేయలేదు. అతనే హైలెట్ అయింది. అతని టైమింగ్ అయితే మరో స్థాయి అనేలా ఉంది. సింపుల్ గా చెబితే ఒన్ మేన్ ఆర్మీలా కనిపించాడు. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది. అతని లవ్ స్టోరీ, పెళ్లి, తర్వాత పెటాకులు మొత్తం హిలేరియస్ గానే కనిపిస్తుంది. విడాకులయ్యాక పిల్లలతో ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. తర్వాత అతని మామగారి ఇంటికి ఎన్.ఎస్.జి అధికారిగా ఎంటర్ అవడం వరకూ ప్రతి సీన్ లోనూ అదిరిపోయింది అనిపించాడు.
బట్ సెకండ్ హాఫ్ మాత్రం అనిల్ తడబడ్డాడు అనిపిస్తాడు. విలన్ ట్రాక్ పేలవంగా మారింది. ఆ కారణంగా ఎన్.ఎస్.జి కమాండ్ వంటి వారితో సీన్స్ తేలిపోయాయి. మెగాస్టార్ సీరియస్ తో ఉండాల్సిన టైమ్ లో కూడా కామెడీ పంచడం కూడా కొంత వరకు కొన్నిసార్లు అతి అనిపిస్తుంది. అదే టైమ్ లో నయనతారతో మాత్రం సీన్స్ బావున్నాయి. అతని తల్లిగా నటించిన జరీనా వాహబ్ తో ఒక సీన్ హైలెట్ గా ఉంది. ఇక వెంకటేష్ ఎంట్రీ మొత్తం బలవంతంగా ఇరికించినట్టుగా ఉంది. అతని ప్లేస్ లో ఇంకెవరైనా కమెడియన్ ను ఎంటర్ చేయించిన బానే ఉండేది. వెంకీ ఎపిసోడ్స్ అంతా ఫోర్స్ డ్ గా ఉన్నాయి. ఇక క్లైమాక్స్ కూడా బలవంతంగా ఉంటుంది. ఆ విలన్ వరకు సెకండ్ హాఫ్ మొత్తం ఎక్కడా ప్రభావితం చేయడం లేదు బాలేదు.
బట్ ఈ మొత్తం మైనస్ లన్నీ ప్లస్ పాయింట్స్ గా చేసింది మెగాస్టార్ టైమింగ్. ప్రతి సీన్ లోనూ తనే ఇన్వాల్వ్ అయినట్టుగా కనిపించాడు. ప్రతి సీన్ లోనూ తనదైన శైలిలో అదరగొట్టాడు. ఆ కారణంగా సంక్రాంతికి పూర్తిస్థాయిలో సినిమా పాస్ అయిపోయినట్టుగా ఉంది.
నటన పరంగా ముందే చెప్పినట్టుగా చిరంజీవి గురించి ఒక వంకా కనిపించదు. ఈ వయసులో కూడా అద్భుతంగా ఆకట్టుకున్నాడు. లవ్ ట్రాక్ నుంచి పిల్లలతో ఎపిసోడ్, నయనతారతో కెమిస్ట్రీ పరంగా ఆకట్టుకున్నాడు. నయనతార మెచ్యూర్డ్ గా కనిపించింది. ఈ పాత్రకు తగ్గట్టుగా మెప్పించింది. సచిన్ ఖేద్కర్ వంకర బుద్ధి వాడుగా కనిపించాడు. కేథరీన్, హర్షవర్ధన్, శ్రీనివాస రెడ్డి వంటి వారితో అప్పుడప్పుడూ ఆకట్టుకున్నారు. శరత్ సక్సేనా అలరించాడు. ఇక వెంకటేష్ పాత్రలో బావున్నాడు. నటనా బావుంది. ఇతర పాత్రలన్నీ మామూలే.
టెక్నికల్ గా సంగీతం హైలెట్ అయింది. నేపథ్య సంగీతం చాలా బావుంది. పాటలన్నీ ఆల్రెడీ హిట్ అయిపోయాయి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎడిటింగ్ వరకు ఓకే. డైలాగ్స్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. దర్శకుడుగా అనిల్ రావిపూడి ఈ సారి జస్ట్ పాస్ మార్కులు మాత్రమే కొట్టుకున్నాడు. సెకండ్ హాఫ్ లో చాలా చాలా వీక్ అయిపోయాడు. ఈ విషయం అతనిపై ముందు నుంచీ ఉన్న కంప్లైంటే. బట్ ఈ సారి మరింత ఎక్కువ తప్పులు చేశాడు.ఇలాగే ఉంటే తర్వాతి కాలంలో మైనస్ అవుతాడు. సో.. ఈ విషయంలో జాగ్రత్త పడాల్సిందే.
ఫైనల్ గా : వర ప్రసాద్ ఒన్ మేన్ షో
రేటింగ్ : 3/5
బాబురావు కామళ్ల
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

