Thank You Review: 'థ్యాంక్యూ' మూవీ రివ్యూ.. 'ప్రేమమ్' ఫీల్‌తో సాగే కథ

Thank You Review: థ్యాంక్యూ మూవీ రివ్యూ.. ప్రేమమ్ ఫీల్‌తో సాగే కథ
Thank You Review: ప్రేమమ్‌లో స్కూల్ కుర్రవాడిగా, కాలేజీ స్టూడెంట్ గా, తర్వాత రెస్టార్టెంట్ ఓనర్ గా కనిపించాడు నాగచైతన్య

విడుదల తేదీ : జులై 22, 2022

నటీనటులు: నాగచైతన్య, రాశి ఖన్నా, మాళవికనాయర్ , అవికా గోర్, సంపత్ రాజ్, తులసి, సాయి సుశాంత్ రెడ్డి, ఈశ్వరి రావు, ప్రకాష్ రాజ్

దర్శకత్వం : విక్రమ్ కె కుమార్

నిర్మాతలు: దిల్ రాజు

సంగీత దర్శకుడు: ఎస్ థమన్

సినిమాటోగ్రఫీ: పిసి శ్రీరామ్

ఎడిటర్: నవీన్ నూలి

ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ లకు యాప్ట్ గా సూట్ అయ్యే నాగచైతన్య, విభిన్న మైన చిత్రాలతో ఆకట్టుకున్న విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా థ్యాంక్యూ. ట్రైలర్ చూస్తుంటేనే అందులో జీవితం కనిపించింది. జీవితంలోని కొన్ని దశలలో కనిపించాడు నాగచైతన్య. మరి థ్యాంక్యూ మూవీ ఎలాంటి ఎక్స్ పీరియన్స్ లను అందించిందో చూద్దాం..

కథ :

అభిరామ్ ( నాగచైతన్య) ఒక సక్సెస్ పుల్ బిజినెస్ మాన్. వైద్య యాప్ ని డెవలప్ చేసి ప్రపంచం గుర్తించిన వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. ఆ ప్రయాణంలో ఒంటరిగా మిగులుతాడు. తన చుట్టూ విజయం తప్ప నా అనే వారు లేకుండా పోతారు. తను ప్రేమించిన ప్రియ( రాశీ ఖన్నా) కూడా దూరం అవుతుంది. అక్కడ మొదలైన ఆత్మ విమర్శ అతన్ని తన మూలాలకు తీసుకువెళుతుంది. తను ఇంత విజయం సాధించడానికి కారణం అయిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ చెప్పాలనుకుంటాడు అభిరామ్. తన ప్రయాణం అతని కథను ఎలా మార్చింది అనేది మిగిలిన కథ..?

కథనం:

ప్రేమమ్‌లో స్కూల్ కుర్రవాడిగా, కాలేజీ స్టూడెంట్ గా, తర్వాత ఒక రెస్టార్టెంట్ ఓనర్ గా కనిపించాడు నాగచైతన్య. ఇప్పుడు థ్యాంక్యూలో కూడా అవే స్టేజ్ లు కనపడటంతో ఆ మార్పు అంతగా కొత్తగా అనిపించలేదు. కానీ నారాయణ పురం ప్రేమ కథ థ్యాంక్యూ సినిమాకు హైలెట్ గా నిలిచింది. పార్వతి ప్రేమ కథ అక్కినేని వంశానికి కలసొస్తుందేమో తెలియదు కానీ ఈ సినిమాలో పార్వతి ప్రేమ కథే చాలా ప్రెష్ గా అనిపించింది. ప్రేమలోని అమయాకత్వం ని తెరమీద అందమైన దృశ్యంగా మలచడంలో విక్రమ్ కె కుమార్ తన సత్తా చూపించాడు. తర్వాత నాగచైతన్య అంతరాత్మకు రూపం ఇచ్చిన దర్శకుడు తర్వాత మజలీలో ఆ మ్యాజిక్ చేయలేకపోయాడు.

అందులో కనిపించిన కాలేజీ గొడవలు కూడా మరీ రోటీన్ గా ఉన్నాయి. అవకా గోర్ ఎపిసోడ్ మాత్రం కొంత మేరకు పర్వాలేదనిపించింది. సెకండ్ ఆఫ్ లో ధ్యాంక్యూ మరింత నీరసంగా మారడానికి కాలేజీ ఎపిసోడ్ లో కినిపించిన రోటన్ నెస్ కారణం . ఇక అక్కడి నుండి సినిమా మీద ఆసక్తిని ప్రేక్షకుడు కోల్పోతాడు. తర్వాత హీరో మూవ్ ఎలా ఉండబోతుందనేది సాధారణ ప్రేక్షకుల అంచానాలకు వచ్చేసింది. ఒక వ్యక్తి ఎదిగే టప్పుడు ప్రతి దశలోనూ ఎవరో ఒకరు కారణం అవుతారు. సక్సెస్ ఇచ్చిన మత్తు కావచ్చు.. ఇదంతా నాదే అన్న అహాం కావచ్చు వారిని కనపడనివ్వవు.

కానీ అంతరాత్మ మాటలు వింటే తన మూలాలకు తిరిగి ప్రయాణం చేస్తే అతని జీవితం మరింత ఆనందంగా తయారవుతుంది . ఇదే థ్యాంక్యూ సినిమా మూల కథ అయితే దాన్ని తెరమీదకు మలచడంలో దర్శకుడు విక్రమ్ కె కుమార్ సగం విజయమే సాధించాడు. అందుకే థ్యాంక్యూ ఫస్ట్ హాఫ్ ఉన్నంత హృద్యంగా సెకండ్ హాఫ్ ఉండదు. నాగచైతన్య తన నటనతో ఆకట్టుకున్నాడు. రాశీ ఖన్నా కు వరల్డ్ ఫేమస్ లవర్ లోని పాత్రను పోలిన పాత్రనే పోషించింది. ప్రకాష్ రాజ్, మాళవిక నాయర్, సుశాంత్ రెడ్డి , అవికా గోర్ తమ పాత్రలకు న్యాయం చేసారు. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఈ మూవీని మరింత అందంగా మలిచింది.

చివరిగా:

నాగచైతన్య కెరియర్ లో మంచి పాత్రగా అభిరామ్ నిలుస్తాడు. సినిమా లో ఆకట్టుకునే అంశాలున్నాయి. కానీ సినిమాని అవి కాపాడతాయనే నమ్మకం లేదు. కాబట్టి థ్యాంక్యూ తీసిన దర్శక నిర్మాతలకు థ్యాంక్యూ చెప్పాలన్నా, సారీ అన్నాలన్నా కష్టమే.

Tags

Read MoreRead Less
Next Story