రివ్యూ

Varudu Kaavalenu Twitter Review : నాగశౌర్య డిసెంట్ హిట్..!

Varudu Kaavalenu Twitter Review : నాగశౌర్య, రితూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’.. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

Varudu Kaavalenu Twitter Review : నాగశౌర్య డిసెంట్ హిట్..!
X

Varudu Kaavalenu Twitter Review : నాగశౌర్య, రితూవర్మ జంటగా నటించిన చిత్రం 'వరుడు కావలెను'.. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం.. నేడు శుక్రవారం(అక్టోబర్‌ 29)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అమెరికా లాంటీ దేశాల్లో ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో సినిమాని చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

సినిమా ప్లాష్‌బ్యాక్‌లో వచ్చే సీన్స్‌ హైలెట్‌ అని చెబుతున్నారు. సినిమాలో భాగంగా వచ్చే ప్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్ సినిమాకి మెయిన్ సోల్ అని అంటున్నారు.

కొన్ని సన్నివేశాలు సినిమాకి ప్రాణం పోశాయని అంటున్నారు. నాగశౌర్య, రితూవర్మ పెయిర్ చాలా బాగుందని చెబుతున్నారు. మొదటి సినిమానే అయిన లక్ష్మి సౌజన్య బాగా టేకాఫ్ చేశారని అంటున్నారు.

ఇక ప్రొడక్షన్ వాల్యూస్, సంగీతం, డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయని చెప్తున్నారు. ఓవరాల్ గా సినిమా బాగుందని, నాగశౌర్య డిసెంట్ హిట్ కొట్టాడని వెల్లడిస్తున్నారు.


Next Story

RELATED STORIES