Nari Nari Nadu Murari : నారీ నారీ నడుమ మురారి మూవీ రివ్యూ

రివ్యూ : నారీ నారీ నడుమ మురారి
ఆర్టిస్ట్స్ : శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య, నరేష్, సంపత్, సునిల్, వెన్నెల కిశోర్, సిరి హనుమంతు తదితరులు
ఎడిటర్ : ఏ శ్రీకర్ ప్రసాద్
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ : జ్ఞానశేఖర్ విఎస్, యువరాజ్
నిర్మాతలు : అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం : రామ్ అబ్బరాజు
నారీ నారీ నడుమ మురారి అనే టైటిల్ తో వచ్చిన మూవీ శర్వానంద్ ది. ఇది క్లాసిక్ మూవీ టైటిల్. అలాంటి టైటిల్ తో శర్వానంద్ మూవీ అంటే మాగ్జిమం అంచనాలు ఉన్నాయి. బట్ కొన్నేళ్లుగా హిట్ లేని శర్వానంద్ మూవీ అనగానే అనుమానాలూ ఉంటాయి. సాక్షి వైద్య, సంయుక్త నారీ నారీగా నటించిన ఈ మూవీ ఎలా ఉంది అనేది చూద్దాం.
కథ :
గౌతమ్(శర్వానంద్) ఓ ఆర్కిటెక్ట్. అతని తండ్రి కార్తీక్ (సీనియర్ నరేష్) రెండో పెళ్లి చేసుకుంటాడు. ఇది గౌతమ్ స్వయంగా చేసిన పెళ్లే. ఇక నిత్య( సాక్షి వైద్య) కూడా ఓ ఆర్కిటెక్ట్. గౌతమ్ తో ప్రేమలో ఉంటుంది. ఆమె తండ్రి లాయర్ రామలింగం(సంపత్) కు గౌతమ్ తో ప్రేమ అంటే నచ్చదు. చివరికి ఒప్పుకుంటాడు. కానీ కేవలం రిజిస్టార్ ఆఫీస్ లోనే పెళ్లి చేయాలని పంతం పడతాడు. అందుకు నిత్య కూడా ఒప్పుకుంటుంది. రిజిస్టార్ లో పెళ్లి అనగానే గౌతమ్ ఉలిక్కి పడతాడు. ఆ పెళ్లిని తప్పించాలని అనేక ప్రయత్నాలు చేస్తాడు. అందుకు కారణం దియా(సంయుక్త). మరి దియా ఎవరు..? ఎందుకు రిజిస్టర్ పెళ్లి విషయంలో గౌతమ్ ఎందుకు భయపడుతుంటాడు.. దియాతో అతనికి సంబంధం ఏంటీ అనేది మిగతా కథ.
ఎలా ఉంది :
ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే హీరోల కథలు చాలానే చూశాం. కానీ ఇందులో భిన్నంగా ఉంటుంది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న హీరో.. తర్వాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటీ అనేది ఈ మూవీలో ప్రధానాంశం. ఈ విషయం రివ్యూలో చెప్పడం కుదరదు. బట్ సినిమా మాత్రం హిలేరియస్ గా ఆకట్టుకుంటుంది. ప్రతి సీన్ లోనూ నవ్వించడమే ప్రధానం అన్నట్టుగా సాగుతుంది. దీంతో పాటు ఆ ఇద్దరు హీరోయిన్లతో హీరోకు ఉండే ప్రేమకథ కూడా అలరిస్తుంది. ఈ తరహా సినిమాలు సీరియస్ గా ఉండే అవకాశం ఉంది. బట్ అందుకు భిన్నంగా హిలేరియస్ గా నవ్వించడం మాత్రం దర్శకుడికి అలవాటైన కథనంలాగా కనిపిస్తుంది. అతని గత సినిమా సామజవరగమన లాగా ఈ మూవీలోనూ ఆడియన్స్ ను నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఆ మూవీలో లాగానే ఇందులోనూ నరేష్ పాత్ర హైలెట్ అవుతుంది. అతని పాత్ర ఆద్యంతం నవ్విస్తుంది. దీంతో పాటు అతను అమాయకత్వం పండించడం మాత్రం బావుంది. వెన్నెల కిశోర్, ప్రవీణ్, సత్య వీళ్లంతా నవ్విస్తూనే కథా పరంగా ముందుకు సాగేలా ఉంటారు. ప్రవీణ్ పాత్ర సైతం అందుకు సరిపోయేలా ఉంటుంది. మొత్తంగా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు నవ్వించడమే ఇంపార్టెంట్ అన్నట్టుగా కనిపిస్తుంది. అలాగని ఇదేమీ ఫోర్స్ డ్ కామెడీ కాదు. సిట్యుయేషనల్ గా, వల్గారిటీ లేకుండా మెప్పించే కామెడీ. ఇదే హైలెట్ గా ఉందీ మూవీలో. ఇలాంటి మూవీస్ చూడ్డం మాత్రం ఆడియన్స్ కు ఆనందం కలిగించే అంశంలా ఉంది.
మైనస్ లు అంటే ఉన్నాయి. అక్కడక్కడా లాగ్ అయినట్టుంది. సంయుక్త పాత్రను ఇంకాస్త బలంగా రాసుకుని ఉండాల్సింది. టైటిల్ కు తగ్గట్టుగా కథనం ఉండాల్సింది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ ఇంకాస్త బలంగా ఉండాల్సింది. ఈ మైనస్ తప్పిస్తే సినిమా ఆసాంతం ఆకట్టుకునేలానే ఉంది.
నటన పరంగా శర్వానంద్ అదరగొట్టాడు. తన లుక్స్ విషయంలో ఈ సారి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కుర్రాడులా కనిపించాడు. సాక్షి వైద్య స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంది. తన పాత్ర బావుంది. నటన చాలా బావుంది. సంయుక్త బాగా నటించింది. వెన్నెల కిశోర్, సంపత్ ట్రాక్ అదిరిపోయింది. సత్య, గెటప్ శ్రీను మెప్పించారు. సిరి హనుమంతు బాగా చేసింది. చివరగా రెండో హీరోగా అన్నట్టుగా కనిపించాడు నరేష్. తనలో ఎంత గొప్ప నటుడు ఉన్నాడు మరోసారి నిదర్శనం. భలే నవ్వించాడు.
టెక్నికల్ గా సంగీతం బావుంది. పాటలు చాలా బావున్నాయి. ఇద్దరు సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారు. ఇద్దరి వర్క్ అమేజింగ్ గా ఉంది. ఎడిటింగ్ బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా మెప్పించాడు. తనతో పాటు రైటర్ భాను భోగవరపు పని కూడా క్లియర్ గా సెట్ అయింది. బాగా చేశాడు.
ఫైనల్ గా : నారీ నారీ నడుమ మురారి బాగా నవ్వించారు
రేటింగ్ : 3/5
బాబురావు కామళ్ల
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

