Pakka Commercial Review: 'పక్కా కమర్షియల్' రివ్యూ.. సినిమాలో హైలెట్ ఇదే..

Pakka Commercial Review: విలన్ నుండి హీరోగా మారిన గోపీచంద్.. బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ చిత్రాలతో ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ గత కొంతకాలంగా గోపీచంద్ సినిమాలు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి. దీంతో కామెడీ సినిమాలతో మెప్పించే డైరెక్టర్ మారుతితో కలిసి 'పక్కా కమర్షియల్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పించగలిగింది..?
పక్కా కమర్షియల్ కథ విషయానికొస్తే.. సూర్యనారాయణ (సత్యరాజ్).. ఓ సిన్సియల్ జడ్జి. కానీ ఓ కేసు విషయంలో తప్పుడు తీర్పు ఇవ్వాల్సి రావడంతో తన వృత్తిని వదిలేసుకుంటాడు. కానీ ఆయన కొడుకు లక్కీ (గోపీచంద్) మాత్రం డబ్బే ముఖ్యమని క్రిమినల్స్ తరపున లాయర్‌గా వాదిస్తుంటాడు. ఇక విలన్‌గా ఉండే రావు రమేశ్ విషయంలోనే సూర్యనారాయణ, లక్కీ తలపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెరపై చూడాల్సిన కథ.
హీరోగా గోపీచంద్.. యాక్షన్, కామెడీ, ఎమోషన్స్.. ఇలా అన్నింటిని సమానంగా పండించారు. కామెడీ లాయర్ పాత్రలో రాశి ఖన్నా.. ప్రేక్షకులను నవ్వించింది. సీరియస్ సబ్జెక్ట్ అయినా కూడా టైటిల్‌కు తగ్గట్టుగా కమర్షియల్‌గా తెరకెక్కించాడు దర్శకుడు మారుతి. క్లైమాక్స్ మాత్రం ఓ చిన్న ట్విస్ట్‌తో ప్రేక్షకుల చేత మెప్పు పొందింది. అక్కడక్కడా కంటిన్యుటీ లేని సీన్లు కాస్త ఇబ్బంది పెట్టినా మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకుల చేత 'పక్కా కమర్షియల్' అనిపించుకుంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com