12 Nov 2021 5:25 AM GMT

Home
 / 
సినిమా / రివ్యూ / Pushpakavimanam...

Pushpakavimanam Review: పుష్పక విమానం.. మూవీ రివ్యూ

Pushpakavimanam Review: ఈ రోజు థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూసి అన్నదమ్ములు ఇద్దరు ఆనందంగా ఉండి ఉంటారనే చెప్పాలి.

Pushpakavimanam Review: పుష్పక విమానం.. మూవీ రివ్యూ
X

సినిమా పుష్పక విమానం

నటీనటులు ఆనంద్ దేవరకొండ, సునీల్, గీతా సైనీ, శాన్వీ మేఘన

దర్శకుడు దామోదర్

నిర్మాత గోవర్ధన్ రావు దేవరకొండ, ప్రదీప్ ఎర్రబెల్లి, విజయ్ మట్టపల్లి

సంగీతం అమిత్ దాసాని, రామ్ మిరియాల

Pushpaka Vimanam Review :

అన్న విజ‌య్ దేవ‌ర‌కొండకు త్వరగానే సక్సెస్ వచ్చింది. తమ్ముడు ఆనంద్ దేవరకొండకు కాస్త ఆలస్యం అవుతుంది. ఇందుకు ముందు వచ్చిన సినిమాలకంటే కొంచెం భిన్నంగా వచ్చిన పుష్పక విమానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆనంద్, విజయ్ బలంగా నమ్ముతున్నారు. ఈ రోజు థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూసి అన్నదమ్ములు ఇద్దరు ఆనందంగా ఉండి ఉంటారనే చెప్పాలి.

రివ్యూ విషయానికి వస్తే..

చిట్టిలంక సుందర్ (ఆనంద్ దేవరకొండ) మీనాక్షి (గీత్ సైని)ని వివాహం చేసుకుంటాడు. అయితే పెళ్లయిన రెండో రోజే మీనాక్షి వేరొకరితో పారిపోతుంది. ఊహించని ఈ విచిత్ర పరిస్థితిని సుందర్ ఎలా ఎదుర్కొంటాడు. అసలు మీనాక్షి ఎందుకు పారిపోయింది అనేది చిత్ర కథాంశం? సుందర్ తన భార్య ఎక్కడికి వెళ్లింది.. ఎవరితో వెళ్లింది తెలుసుకున్నాడా ?

ఆనంద్ దేవరకొండ తన భార్య పారిపోయిందన్న విషయాన్ని బయటకు చెప్పుకోలేక, ఆమె తనతోనే ఉందని నమ్మించలేక పడే పాట్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. మరొకరిని (శాన్వీ మేఘన) తీసుకువచ్చి తన భార్యగా లోకాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. సుందర్ పాత్రలో ఆనంద్ నటన ఆకట్టుకుంటుంది.

సినిమా సినిమాకు అతడి నటనలో పరిణతి స్పష్టంగా కనిపిస్తుంది. గీత్ సైనీ తన సహజ నటనను ప్రదర్శించింది. నకిలీ భార్యగా సాన్వీ కూడా తన నటనతో ఆకట్టుకుంది. పోలీస్ అధికారి పాత్రలో సునీల్ తనదైన స్టైల్ లో నటించాడు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది.

దర్శకుడు దామోదర్ సిట్యుయేషనల్ కామెడీని బాగా పండించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలన్నీ సందర్భానుసారంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.

Next Story