Raksha Bandhan Review: 'రక్షా బంధన్' మూవీ రివ్యూ.. కొన్ని నవ్వులు, చాలా ఎమోషన్స్‌తో..

Raksha Bandhan Review: రక్షా బంధన్ మూవీ రివ్యూ.. కొన్ని నవ్వులు, చాలా ఎమోషన్స్‌తో..
Raksha Bandhan Review: అక్షయ్ కుమార్, ఆనంద్ రాయ్ కాంబినేషన్‌లో వచ్చిన ప్రతీ సినిమా ప్రేక్షకులకు చాలావరకు నచ్చేలా ఉంటుంది

Raksha Bandhan Review: బాలీవుడ్‌లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాల ఒకేరోజు విడుదలయ్యి పోటీపడడం జరిగి చాలాకాలమే అయ్యింది. ఇక ఇన్నిరోజుల తర్వాత అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా', అక్షయ్ కుమార్ నటించిన 'రక్షా బంధన్' ఒకేరోజు బాక్సాఫీస్ బరిలో దిగాయి. ఓవైపు 'లాక్ సింగ్ చడ్డా'కు పర్ఫెక్ట్ రీమేక్ అని రివ్యూలు వస్తుండగా 'రక్షా బంధన్' కూడా పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీ అని పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తోంది.


అక్షయ్ కుమార్, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్‌లో వచ్చిన ప్రతీ సినిమా ప్రేక్షకులకు చాలావరకు నచ్చేలా ఉంటుంది. ఇక రక్షా బంధన్ కూడా ఆ లిస్ట్‌లోకి యాడ్ అయిపోయినట్టే అని ట్విటర్ రివ్యూ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో ఇప్పటివరకు అన్నా, చెల్లెళ్ల అనుబంధం గురించే దర్శకుడు ఎక్కువగా వివరించాడు అనిపించినా కూడా.. ఇందులో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి.


కట్నం అనేది పెళ్లిల్లో ఎలాంటి పాత్ర పోషిస్తుంది. పెళ్లిలో అమ్మాయి వాళ్లకి, అబ్బాయి వాళ్లకి ఎలాంటి వ్యత్యాసం ఉంటుంది. ఇలాంటి సున్నితమైన అంశాల గురించి 'రక్షా బంధన్'లో చర్చించాడు దర్శకుడు. ఈ సినిమాలో హీరోకు, తన చెల్లెళ్లకు మధ్య ఉన్న సన్నివేశాలు ఎంతగా నవ్విస్తాయో.. అంతే కంటతడి పెట్టిస్తాయని ప్రేక్షకులు అంటున్నారు.


సదీయా ఖతీబ్, సహేజ్‌మీన్ కౌర్, దీపికా ఖన్నా.. అక్షయ్ కుమార్‌లాంటి స్టార్ హీరోతో మొదటిసారి నటించినా కూడా చెల్లెళ్ల పాత్రలో ఒదిగిపోయారు. ఇక అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్ మధ్య ఉన్న ప్రేమకథ కూడా స్క్రీన్‌పై చాలా క్యూ్ట్‌గా అనిపిస్తుంది. ఇక ఈ రాఖీ పండుగకు 'రక్షా బంధన్' ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమా అని ప్రేక్షకులు కితాబు ఇచ్చేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story