Sahakutumbanam Movie Review : సఃకుటుంబానాం మూవీ రివ్యూ

Sahakutumbanam Movie Review :  సఃకుటుంబానాం మూవీ రివ్యూ
X

రివ్యూ : సఃకుటుంబానాం

ఆర్టిస్ట్స్ : రామ్ కిరణ్, మేఘా ఆకాష్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య తదితరులు

ఎడిటర్ : శశాంక్ మాలి, శివ శర్వాని

సంగీతం : మణిశర్మ

సినిమాటోగ్రఫీ : మధు దాసరి

నిర్మాతలు : హెచ్. మహదేవ్ గౌడ్, హెచ్. నాగరత్న

దర్శకత్వం : ఉదయ్ శర్మ

హెచ్ ఎన్ సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్‌పై మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా, ఉదయ్ శర్మ రచన మరియు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “సఃకుటుంబానాం” నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటించిన ఈ సినిమాలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం అందించగా, మధు దాసరి సినిమాటోగ్రాఫర్‌గా, శశాంక్ మలి ఎడిటర్‌గా పనిచేశారు. ఇక రివ్యూకు వస్తే…

కథాంశం :

సాధారణ మధ్యతరగతి కుటుంబంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన యువకుడు తన కుటుంబంపై అపారమైన ప్రేమ చూపిస్తాడు. అతని శాంతమైన జీవితంలో ఒక అమ్మాయి తన టీమ్‌లో చేరడంతో ప్రేమ పుడుతుంది, దాన్ని కుటుంబానికి పరిచయం చేస్తాడు. కానీ ఆమె రాకతో కుటుంబంలో వచ్చే మార్పులు ఏమిటి? బయటపడే రహస్యాలు ఎలాంటివి? అతని జీవితంలో వచ్చే పరివర్తనలు ఎటువంటివి? చివరికి కుటుంబం మొత్తం ఐక్యంగా ఉంటుందా? అతనికి ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి? విలన్ వారి జీవితాల్లోకి ఎలా ప్రవేశిస్తాడు? ఈ ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెండితెరపై “సహకుటుంబానాం” చూడాల్సిందే.

నటీనటుల నటన :

హీరోగా పరిచయమైన రామ్ కిరణ్ తన నృత్యం మరియు నటనతో సత్తా చాటుకున్నాడు. యాక్షన్ నుంచి ఎమోషనల్ సీన్ల వరకు ప్రతి దృశ్యంలో ప్రేక్షకులను మెప్పించాడు. రెండు విభిన్న లుక్స్‌లో కనిపిస్తూ, తొలి చిత్ర నటుడనే సందేహం రానివ్వకుండా అద్భుతంగా నటించాడు. హీరోయిన్ మేఘ ఆకాష్ ఇప్పటికే అనేక చిత్రాల్లో నిరూపించుకున్న నటి అయినప్పటికీ, ఇక్కడ అమాయకత్వంతో మరియు మరో భాగంలో స్మార్ట్‌గా కనిపిస్తూ ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చింది. రాజేంద్రప్రసాద్ తండ్రి పాత్రలో సహజసిద్ధంగా జీవించేశాడు. బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, భద్రం, నిత్య, రచ్చ రవి తదితరులు తక్కువ స్క్రీన్ టైమ్‌లోనూ తమ పాత్రలకు న్యాయం చేస్తూ, వినోదాన్ని అందించి సినిమాను ముందుకు తీసుకెళ్లారు.

సాంకేతిక విభాగం :

ప్రస్తుత థియేటర్లలోని సినిమాలకు భిన్నంగా సరికొత్త కథాంశంతో వెండితెరను అలరించడంలో దర్శకుడు ఉదయ్ శర్మ విజయవంతమయ్యాడు. రంగుల కలయిక మరియు విజువల్స్ అద్భుతంగా తీర్చిదిద్దారు, ఇది సినిమాటోగ్రాఫర్ మధు దాసరి పనితీరును ప్రతిబింబిస్తుంది. హీరో, హీరోయిన్ మరియు ఇతర నటుల కాస్ట్యూమ్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు మరియు నృత్యాలు సినిమాకు పెద్ద ప్లస్. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి, లొకేషన్లు మరియు ఇతర సాంకేతిక అంశాలు అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయి.

ప్లస్ పాయింట్స్ :

కథాంశం, దర్శకత్వం, నటీనటుల ప్రదర్శనలు, నృత్యాలు, ఇంటర్వెల్ ట్విస్ట్.

మైనస్ పాయింట్స్ :

కొన్ని నెమ్మదిగా సాగే సీన్లు.

సారాంశం :

కుటుంబ విలువలను, విభేదాలను ఎలా సమతుల్యం చేయాలో చూపిస్తూ, అవి కుటుంబ బంధాలను ఎంత బలోపేతం చేస్తాయో నేర్పిస్తున్న “సహకుటుంబానాం” కుటుంబ సమేతంగా చూడదగిన అద్భుత చిత్రం. హృదయాన్ని తాకే సందేశంతో పాటు ఆకట్టుకునే వినోదాన్ని అందిస్తుంది.

రేటింగ్ : 3/5

Tags

Next Story