Shabaash Mithu Review: 'శభాష్ మిథు' రివ్యూ.. మిథాలీ రాజ్‌గా తాప్సీ మెప్పించగలిగిందా..?

Shabaash Mithu Review: శభాష్ మిథు రివ్యూ.. మిథాలీ రాజ్‌గా తాప్సీ మెప్పించగలిగిందా..?
Shabaash Mithu Review: శుక్రవారం విడుదలయిన శభాష్ మిథు సినిమాకు మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది.

Shabaash Mithu Review: హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేయాలంటే కొందరు నటీమణులు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అలాంటి లిస్ట్‌లో ఎప్పుడో జాయిన్ అయ్యింది తాప్సీ పన్ను. తెలుగులో తను ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లోనే నటించినా.. బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత మాత్రం పూర్తిగా కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలవైపు అడుగులేసింది ఈ భామ. వాటిలోనే సక్సెస్ అయ్యింది కూడా. తాజాగా 'శభాష్ మిథు' అనే బయోపిక్‌తో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చింది తాప్సీ.

ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్‌కు ప్రజల్లో గుర్తింపు తెచ్చినవారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేరు మిథాలీ రాజ్. ఉమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా మిథాలీ ఓ మార్క్‌ను సెట్ చేసి వెళ్లిపోయింది. కానీ ఈ స్థాయికి రావడానికి తను చేసిన పోరాటం గురించి చాలామందికి తెలియదు. ఆ ప్రయాణాన్నే ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ. ఇక ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసే తాప్సీ.. మిథాలీ పాత్ర చేయడం కోసం చాలానే కష్టపడింది.

శుక్రవారం విడుదలయిన శభాష్ మిథు సినిమాకు మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. తాప్సీ.. మిథాలీ క్యారెక్టర్‌కు సెట్ అవ్వలేదని.. క్రికెటర్ బయోపిక్ అంటే కేవలం ఇలాగే తీయాలి అని రూల్ పెట్టుకున్నారా అని.. ఇలా మూవీ టీమ్‌పై నెగిటివ్‌గా విమర్శలు చేస్తున్నారు కొందరు నెటిజన్లు. కానీ మరికొందరు మాత్రం మిథాలీ రాజ్‌కు ఇది పర్ఫెక్ట్ బయోపిక్ అని ప్రశంసిస్తున్నారు.


Tags

Next Story